Kajal Photo on Tamil Nadu ration Smart Card | సరోజ రేషన్ కార్డు.. పాపం... కాజల్ అగర్వాల్ ఫోటో.

Kajal agarwal ration card

Tamil Nadu, Kajal Agarwal Photo, Smart Ration Card, Official Mistakes, Saroja Ration Card Kajal Photo

Actress Kajal Agarwal Photo on Ration Card of a Selam Woman. Tamil Nadu Revenue department has been issuing Smart cards in place of Ration card for families coming under the public distribution scheme.

రేషన్ కార్డు మీద కాజల్ ఫోటో

Posted: 09/13/2017 02:21 PM IST
Kajal agarwal ration card

అధికారుల తప్పిదాలు ఎంత ఘోరంగా ఉంటాయో తెలియజేసే ఘటన ఒకటి తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది. గతంలో జారీ చేసిన రేషన్ కార్డుల స్థానంలో ఇప్పుడు కొత్తగా స్మార్ట్ కార్డులను పంపిణీ చేస్తున్నారు. సంబంధిత అధికారులు లబ్ధిదారులకు స్మార్ట్‌ కార్డులను జారీ చేసే పనిలో బిజీగా ఉన్నారు. సేలంకు చెందిన సరోజా కుటుంబం పెద్ద కావటంతో ఆమె పేరు మీద కార్డు జారీ అయ్యింది.

ఇంటికొచ్చిన కార్డను చూసుకున్న ఆమె ఒక్కసారిగా షాక్ కి గురయ్యింది. త‌న ఫొటో ఉండాల్సిన చోట హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఫొటో ఉండ‌డంతో కంగుతింది. వెంటనే విష‌యాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. నాలుక కరుచుకున్న అధికారులు మరో కార్డును ఆమెకు జారీ చేశారు. ఒక్క ఆమె కార్డులోనే కాదు.. చాలా మంది ల‌బ్ధిదారుల‌ కార్డుల్లోనూ ఇలాగే హీరో, హీరోయిన్లు ఫోటోలతో, పేర్లలో తప్పులతో కార్డులు జారీ అయ్యాయని సమాచారం.

Kajal Photo on Smart card

కొన్ని న‌గ‌రాల్లో స్మార్ట్ కార్డుల్లో నటులతో పాటు చెట్లు, జంతువుల ఫోటోలు కూడా జారీ అయినట్లు చెబుతున్నారు. దీనిపై పీఎంకే నేత డాక్టర్ రామ్ దాస్ తీవ్రంగా మండిపడుతున్నారు. అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kajal Agarwal  Tamil Nadu ration Cards  Official Mistakes  

Other Articles