కీర్తి సురేశ్ జిరాక్స్ లాగే ఉందిగా... | Keerhi Suresh Xerox of Savitri

Keerhi suresh look in mahanati

Mahanati Movie, Keerthi Suresh, Savitri Look, Savitri Biopic, Savitri Keerthi Suresh

Keerthi Suresh Official Look from Savitri Release. She Looks Like Legendary actress in Mahanati.

మహానటి లుక్.. అచ్చం సావిత్రిలా ఉన్న కీర్తి

Posted: 09/11/2017 04:31 PM IST
Keerhi suresh look in mahanati

తెలుగు తెరపై తనదైన అభినయంతో ప్రేక్షకుల్లో బలమైన ముద్ర వేసుకున్న లెజెండరీ నటి సావిత్రి. ఆమె బయోపిక్ తెరకెక్కించటం అంటే మాములు విషయం కాదు. ఎందుకంటే ఆమె జీవితం కూడా అంతే సినిమాటిక్ గా సాగింది కనుక. కెరీర్ లో సూపర్ సక్సెస్ అయిన ఆమె పర్సనల్ లైఫ్ మాత్రం అస్తవ్యస్తంగా ఉండటమే అందుకు కారణం.

ఇక ఎవడే సుబ్రహ్మణ్యం చిత్ర దర్శకుడు నాగ అశ్విని మాత్రం ఆ ఛాలెంజ్ ను స్వీకరించి అల్రెడీ చిత్రీకరణ కూడా మొదలుపెట్టాడు. నిత్యామీనన్ లాంటి టాలెంట్ యాక్ట్రెస్ తప్పుకోవటంతో ఆ ఛాన్సు మాలీవుడ్ బ్యూటీ కీర్తి సురేష్ కు దక్కింది. పెద్దగా అనుభవం లేని హీరోయిన్.. మరి సావిత్రి రోల్ లో ఎలా చేస్తుంది.. అసలు ఎలా సూటవుతుంది అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే ఇప్పుడు రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ ఆ అనుమానాలను పటాఫంచల్ చేసేసింది.

Keerthi Suresh New Movie

సావిత్రి లుక్ కీర్తి సురేష్ అదిరిపోయిందనే చెప్పుకోవాలి. క్యూట్ లుక్కులో కీర్తి ఫోటోను అలనాటి అందాల తార ఫోటోను పక్కపక్కనే పెట్టి చూస్తే అచ్చం జిరాక్స్ కాపీలాగే అనిపిస్తోంది. ఇక ఇప్పుడు తేలాల్సింది నటనతో సావిత్రిని ఆమె ఎలా మరిపిస్తుందనే. నటుడు, సావిత్రి భర్త జెమినీ గణేషన్ రోల్ లో మళయాళ యంగ్ స్టర్ సల్మాన్ దుల్కర్ నటిస్తుండగా, సమంత, ప్రకాశ్ రాజ్ లు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles