Sharwanand's Mahanubhavudu Title song On the Way

Mahanubhavudu first song release date

Sharwanand, Mahanubhavudu Movie, Title Song, First Song Release, Director Maruthi, Mehrene Kaur Pirzada

Title song of Sharwanand's Mahanubhavudu, First Single of Sharwanand film to release on 7th September.

మహానుభావుడు ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్

Posted: 09/05/2017 04:17 PM IST
Mahanubhavudu first song release date

టాలీవుడ్ లో వరుస విజయాలతో ఊపు మీద ఉన్న శర్వానంద్ ప్రయోగాత్మక చిత్రాల వైపు మళ్లాడు. మారుతి దర్శకత్వంలో దసరాకి మహానుభావుడిగా రాబోతున్నాడు. యూవీ క్రియేషన్స్ వారు .. గీతా ఆర్ట్స్ 2 వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

శర్వానంద్ జోడీగా మెహ్రీన్ నటించిన ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నెల 7వ తేదీ ఉదయం 8 గంటల 45 నిమిషాలకి ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. కథానాయకుడు అతిశుభ్రతను పాటించే ఓసీడీ అనే మానసిక వ్యాధి కలిగినవాడిగా కనిపిస్తాడట.

అందుకు సంబంధించి ఇటీవల వదిలిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో 'భలే భలే మగాడివోయ్' తరహాలో ఈ సినిమా కూడా హిట్ కొడుతుందనే ఆశతో ఈ సినిమా టీమ్ వుంది. ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. దసరా బరిలో గట్టి పోటీ ఉండగా రంగంలోకి దిగుతోన్న ఈ సినిమా, ఎంతవరకూ తట్టుకుని నిలబడుతుందనేది ఆసక్తికరంగా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles