ఓవర్సీస్ లో అర్జున్ రెడ్డి ఆరాచకం.. లాంగ్ రన్ లో మరిన్ని రికార్డులు ఖాయం | Arjun Reddy Shutters Overseas Record

Arjun reddy creates wonder in overseas

Arjun Reddy, Arjun Reddy Overseas Collection, Arjun Reddy Movie, Arjun Reddy Record, Arjun Reddy New Collections, Arjun Reddy Track, Vijay Devarakonda on Controversies

Arjun Reddy Box Office Collection. Vijay's movie enters $1 million club in the US.

ఓవర్సీస్ లో అర్జున్ రెడ్డి సంచలనం

Posted: 08/31/2017 06:34 PM IST
Arjun reddy creates wonder in overseas

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఓవర్సీస్ లోనూ అర్జున్ రెడ్డి హవా కొనసాగుతోంది. ఈ నెల 25వ తేదీన విడుదలైన చిత్రం కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు క్రియేట్ చేయటం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా యూఎస్ లో కొత్త రికార్డును క్రియేట్ చేసిందీ చిత్రం.

అమెరికాలో కేవలం 89 థియేటర్స్ లో మాత్రమే విడుదలైన ఈ సినిమా, కేవలం 5 రోజుల్లోనే 11 లక్షల ఒక వేయి 167 డాలర్లను వసూలు చేసింది. ఇంత తక్కువ థియేటర్స్ లో విడుదలై .. ఇంత తక్కువ సమయంలో ఒక మిలియన్ డాలర్లను వసూలు చేసి ఆశ్చర్యచకితులను చేసింది. ఇంతకు ముందు అక్కడ రిలీజైన ఏ తెలుగు సినిమా ఈ అరుదైన ఫీట్ ను సాధించలేకపోవడం విశేషం. లాంగ్ రన్ లో మరిన్ని వండర్స్ క్రియేట్ చేయటం ఖాయమనే చెప్పుకుంటున్నారు.

ఇదిలా ఉంటే సినిమా కాంట్రవర్సీలపై చిత్ర హీరో విజయ్ దేవరకొండ మళ్లీ స్పందించాడు. ఏ సినిమా అయినా బాగుంటే కాంట్రావర్సీస్ ఎంత చేసినా ఎవరూ పట్టించుకోరని ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. ప్రేమ యొక్క స్వచ్ఛమైన రూపం ‘కిస్’ అని, కాంట్రావర్సీ సినిమా తాము తీయలేదని, ఈ సినిమాపై కొందరు కాంట్రావర్సీ చేస్తున్నారని అన్నారు. ఈ సినిమాలో హిపోక్రసీ లేదని, ఇలాంటి ప్రేమకథలు చాలా ఉంటాయని, అందుకే, ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చిందని, బాగా ఆదరిస్తున్నారని చెబుతున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Arjun Reddy  Overseas Collections  Vijay Devarakonda  

Other Articles