రానా షోనే నెం 1 కానీ... సింగిల్ ఎపిసోడ్ తోనే... | Rana Show Beat Bigg Boss Show But

Rana no 1 yaari in top position

Rana No 1 Yaari, No 1 Yaari Show, No 1 Yaari TRP, Bigg Boss No 1 Yaari, Rana Beat NTR Show, Rana Single Episode TRP, NTR Bigg Boss Beat Rana No 1 Yaari

Rana's No 1 Yaari Breaks Into No 1 Spot. No.1 Yaari, aired on Gemini TV, has recorded a highest TVR of 10.3 whereas NTR's Bigg Boss is limited to 6.23. But Over All NTR Bigg Boss in Number 1 Position.

రానా నెం 1 యారి టాప్ టీఆర్పీ

Posted: 08/31/2017 06:05 PM IST
Rana no 1 yaari in top position

స్మాల్ స్క్రీన్ పై వండర్స్ చేస్తూ హీరోలు ఎన్టీఆర్, రానాలు తమ షోలను దిగ్విజయ్ గా పూర్తి చేస్తున్నారు. అయితే మాములు టాక్ షోగా ఉందని నెం 1 యారిపై తొలినాళ్లలో కామెంట్లు వినిపించాయి. దానికి తగ్గట్లే టీఆర్పీలో కూడా వెనకబడిపోయి ఉంది. అయితే ఇప్పుడు బిగ్ బాస్ రానా షో బీట్ చేసిందంటూ వార్తలు వెలువడుతున్నాయి.

నిజానికి బిగ్ బాస్ ను వీకెండ్ వచ్చిందంటే చాలూ ఎక్కడికో టీఆర్పీని తీసుకెళ్తూ ఎన్టీఆర్ సింగిల్ హ్యాండ్ తో రన్ చేస్తున్నాడు. దీంతో సెలబ్రిటీస్ తో రానా సందడి చేస్తున్నప్పటికీ రానా షోకి రాను రాను వ్యూవర్స్ తగ్గిపోవటం ఖాయమనే అంతా భావించారు. క్రేజీ సెలబ్రిటీలు వస్తున్నప్పటికీ ఎందుకు ఇలా అవుతుందోనని నిర్వాహకులు కంగారు పడి పోయారు. కానీ, గత కొన్ని ఎపిసోడ్స్ లో రానా షో పుంజుకుని నంబర్ వన్ పొజిషన్ కి వెళ్లిపోయింది. రానా యాంకరింగ్ ఇంప్రూవ్ కావటంతోపాటు, వచ్చే సెలబ్రిటీలతో ఎంటెర్ టైనింగ్ కాన్సెప్ట్ లను రన్ చేస్తుండటంతో షో ఒక్కసారిగా పుంజుకుంది.

మంచు లక్ష్మీ, తాప్సీ ఎపిసోడ్ కు 10.3 టీఆర్పీ రావటం, ఎన్టీఆర్ షో జస్ట్ 8.5 తో సరిపెట్టుకోవటంతో నెం 1 యారి నంబర్ వన్ షోగా మారిపోయింది. అయితే ఓవరాల్ గా అన్ని ఎపిసోడ్స్ చూసుకుంటే మాత్రం బిగ్ బాస్ టాప్ పొజిషన్ లో ఉంది. అదన్న మాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rana  No 1 Yaari  NTR  Bigg Boss  

Other Articles