హిట్లు లేకపోయినా లిస్ట్ లో టాప్.. ఎలా? | No Hits SRK and Salman in Forbes Highest Paid Actors List

Srk top in forbes 2017 actors list

Forbes Highest Paid Actors List 2017, Shah Rukh Khan, SRK and Salman Forbes Actors List

Bollywood Forbes Highest Paid Actors List Out. Shah Rukh Khan Leads with 38 Million Dollars. Salman Khan and Akshay kumar Follows Badshah. Actress Deepika Padukone, Priyanka Chopra in 6 and 7 Position. Deepika ranks sixth in the list with earnings of $11 million, while Priyanka shares the seventh spot with Deepika's beau Ranveer Singh, with earnings of $10 billion.

ఫోర్బ్స్ లిస్ట్ లో బాలీవుడ్ బాద్ షా టాప్

Posted: 08/31/2017 03:50 PM IST
Srk top in forbes 2017 actors list

సినిమాల పరంగా హిట్లు లేకపోయినా బాలీవుడ్ సీనియర్ హీరో షారూఖ్ ఖాన్ మరో ఘనత దక్కించుకున్నారు. బాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోల జాబితాను ప్రముఖ బిజినెస్ మేగజైన్ ఫోర్బ్స్ విడుదల చేయగా, ఈ సంవత్సరం కింగ్ షారూక్ ఖాన్ తొలి స్థానంలో నిలిచాడు. ఆయన 'రయీస్' చిత్రంతో పాటు పలు బ్రాండ్లకు ప్రచారకర్తగా ఉంటూ 38 మిలియన్ డాలర్లు సంపాదించాడని, మిగతా వారికన్నా అధిక మొత్తంలో ఆదాయం పొందాడని ఫోర్బ్స్ పేర్కొంది.

ఇక రెండో స్థానంలో భాయిజాన్ సల్మాన్ ఖాన్ 37 మిలియన్ డాలర్ల ఆదాయంతో నిలువగా, అక్షయ్ కుమార్ 35.5 మిలియన్ డాలర్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక వీరందరికీ దూరంగా కేవలం 12.5 మిలియన్ డాలర్ల ఆదాయంతో అమీర్ ఖాన్ నాలుగో స్థానంలో ఉన్నాడని ఫోర్బ్స్ వెల్లడించింది. ఐదో స్థానంలో 11.5 మిలియన్ డాలర్లతో హృతిక్ రోషన్ ఉన్నారు.

లిస్ట్ లో ట్విస్ట్ ఇస్తూ ఆరో స్థానంలో 11 మిలియన్ డాలర్లతో దీపికా పడుకొనే, ఆపై 10 మిలియన్ డాలర్ల ఆదాయంతో రణవీర్ సింగ్, అంతే మొత్తం ఆదాయంతో ప్రియాంకా చోప్రా 7వ స్థానాన్ని పంచుకున్నారు. అమితాబ్ బచ్చన్, రణబీర్ కపూర్ లు 9, 10వ స్థానాల్లో ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Forbes List 2017  Highest Paid Actors  Shah Rukh Khan  Salman Khan  

Other Articles