టాలీవుడ్ టూ హాలీవుడ్.. ఎవరీ హీరోయిన్ | Dasari Heroine in American TV Show

Another indian actress in american tv show

Pooja Batra, Pooja Batra Movies, Pooja Batra Tollywood Movies, Pooja Batra American Show, Pooja Batra Lethal Weapon Show, Lethal Weapon Indian Actress

Actress Pooja Batra joins cast of American TV show Lethal Weapon. The Bollywood Actress also Appears in Dasari Arun Kumar Greeku Veerudu and Nagarjuna Sisindri(Special Song).

అమెరికన్ టీవీ షోలో మరో ఇండియన్ హీరోయిన్

Posted: 08/28/2017 05:47 PM IST
Another indian actress in american tv show

ఇండియన్ ఫిల్మ్ స్క్రీన్ నుంచి మరో హీరోయిన్ హాలీవుడ్ కు పరిచయం కానుంది. ఓ టీవీషో కోసం ఆమెను సెలక్ట్ చేసినట్లు సమాచారం. ఇంతకీ ఆమె ఎవరో కాదు. టాలీవుడ్ లో దాసరి అరుణ్ కుమార్ డెబ్యూ మూవీ గ్రీకు వీరుడులో నటించిందే పూజా బత్రా. ఆవిడే.  1993 మిస్ ఫెమినా ఇండియా అయిన పూజా బత్రా.. పలు బాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించింది.

అమెరికా టీవీషో `లెథ‌ల్ వెప‌న్‌` టీవీ షోలో బాత్రా న‌టించనుంది. ఇప్ప‌టికే ఆమె పాత్ర షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఈ విష‌యాన్ని ఆమె ట్విట్ట‌ర్ ద్వారా అభిమానుల‌కు తెలియ‌జేసింది. టీవీ షోలో న‌టించే ప్ర‌ముఖ హాలీవుడ్ న‌టులతో దిగిన ఫొటోను ఆమె షేర్ చేశారు.

హిందీలో విరాస‌త్‌, చంద్ర‌లేఖ‌, హ‌సీనా మాన్ జాయేగీ, క‌హీ ప్యార్ న హోజాయే వంటి హిట్ చిత్రాల్లో న‌టించింది. తెలుగులో `సిసింద్రీ` సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ తోనే టాలీవుడ్ లో బత్రా డెబ్యూ అయ్యింది కూడా . ఆ మధ్య ఏబీసీడీ2 లో మెరిసిన పూజా ప్రస్తుతం సినిమాలేవీ లేకపోవటంతో ఇలా హాలీవుడ్ కు జంప్ అయిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pooja Batra  American TV Show  Lethal Weapon  

Other Articles

Today on Telugu Wishesh