సై... రా నరసింహారెడ్డి మరికాసేపట్లో? | Sye Raa Titile Consider For Chiru 151 Movie

Chiru 151 title reveal today

Chiranjeevi 151 Movie, Chiru 151 Title, Chiru Birthday, Chiru Birthday Special, Chiranjeevi Special Chiranjeevi Sye Raa Narasimha Reddy, Sye Raa Movie, Sye Ra movie

Chiranjeevi 151 Movie title fixed as Sye Raa Narasimha Reddy. Chiru's Birthday Occasion Konidela Production House Release First Look And Reveal Title.

చిరు 151 టైటిల్.. మరికాసేపట్లో...

Posted: 08/22/2017 08:29 AM IST
Chiru 151 title reveal today

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంకు సంబంధించి సస్పెన్స్ మరికాసేపట్లో వీడిపోనుంది. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కనున్న తాజా చిత్రం ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. సురేందర్‌రెడ్డి దర్శకుడు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై తనయుడు రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

స్వాతంత్య్ర సమరసేనాని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వీరోచిత పోరాటానికి దృశ్యరూపంగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. వివిధ భారతీయ భాషల్లో ఈ చిత్రాన్ని అనువాదం రూపంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్ష్ కోసం భారీ స్థాయిలో బడ్జెట్ వెచ్చించబోతున్నారనేది టాక్. ఇక ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకొని నేడు ప్రకటించబోతున్నారు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ చిత్రానికి సై...రా నరసింహారెడ్డి అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. సై..రా ప్రధాన టైటిల్ కాగా..నరసింహారెడ్డి ఉపశీర్షికగా వుంటుందని తెలిసింది. దాదాపు 150కోట్ల భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. రాజమౌళి చేతుల మీదుగా ఇది ఆవిష్కరించబోతున్నారని చెప్పుకుంటున్న విషయం తెలిసిందే.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiranjeevi  151 Movie  Uyyalawada Narasimha Reddy Biopic  Sye Raa  

Other Articles