అర్జున్ రెడ్డిపై పొలిటికల్ ఫైర్.. లిప్ లాక్ లు లేపేశారు | Arjun Reddy Kiss Poster in Controversy

Political fire on arjun reddy vulgar poster

Arjun Reddy Movie, Arjun Reddy Vulgar Poster, Arjun Reddy Kiss Scenes, Arjun Reddy Vulgar Poster Controversy, Arjun Reddy Movie Censor

Political Leaders Fire on Arjun Reddy Movie Lip Lock Scenes and Poster. In Censor they Chopped already.

అర్జున్ రెడ్డి సెన్సార్ పూర్తి.. పోస్టర్ పై వీహెచ్ మండిపాటు

Posted: 08/21/2017 09:23 AM IST
Political fire on arjun reddy vulgar poster

పెళ్లి చూపులు మూవీతో సెన్సేషన్ స్టార్ గా మారిపోయిన విజయ్ దేవరకొండ తర్వాత ద్వారకతో కాస్త డల్ అయిపోయాడనే చెప్పుకోవచ్చు. అయితేనేం లైనప్ లో అరడజన్ సినిమాల్లో నటిస్తున్న విజయ్ పై యూత్ లో మంచి క్రేజే నెలకొంది. ఈ నేపథ్యంలో తన తర్వాతి చిత్రం అర్జున్ రెడ్డిని ఈ నెల 25న రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు.

అయితే ఈ సినిమా పోస్టర్ పై ఇప్పుడు పొలిటికల్ దుమారం రేగుతోంది. అవి చాలా అసహ్యాంగా యూత్ ను చెడుదోవ పట్టించే విధంగా ఉన్నాయంటూ సీనియర్ కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) మండిపడుతున్నారు. ‘ఈ చిత్రం పోస్టర్లు ఆర్టీసీ బసులపై, బస్టాండ్ ల వద్ద వేశారు. హీరో, హీరోయిన్లు ముద్దు పెట్టుకుంటున్నట్టు ఉన్న అవి యువతను చెడుదోవ పట్టించేలా వున్నాయి’ అంటూ విమర్శించారు.

మరోపక్క సెన్సార్ పూర్తి చేసుకుని ఏ సర్టిఫికెట్ పొందిన ఈ సినిమాలోని రెండు లిప్ లాక్ లను లేపేసినట్లు తెలుస్తోంది. కాగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కోపిష్టి మెడికో పాత్రలో విజయ్ దేవర కొండ, ప్రేమికురాలిగా షాలిని నటిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Arjun Reddy Movie  Vijay Devarakonda  Vulgar Posters  

Other Articles

Today on Telugu Wishesh