లై నెగటివ్ టాక్.. నితిన్ నిజాయితీ చూశారా! | Nithiin Confess Lie Movie Negative Talk

Nithiin on lie movie talk

Nithiin, Nithiin LIE, Nithiin LIE Negative Talk, Nithiin Movie Talk, Nithiin Negative Talk, LIE Movie Negative Talk, Nithiin Confess Negative Talk

Nithiin LIE Movie get Negative Talk. He Confessed it and hopes will increase collections by week end.

లై టాక్ పై నితిన్ రియాక్షన్

Posted: 08/14/2017 04:33 PM IST
Nithiin on lie movie talk

స్టైలిష్ మేకింగ్, మంచి అంచనాల మధ్య రిలీజ్ అయిన నితిన్ లై సినిమాకు తొలిరోజు పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే మరీ లాజిక్ లు ఎక్కువైపోవటంతో రాను రాను సినిమాకు క్రౌడ్ తగ్గుతూ వస్తున్నారు. యూఎస్ లో పరిస్థితి కాస్త ఫర్వాలేదుగానీ ఇక్కడ మరీ దారుణంగా ఉందని లెక్కలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో నితిన్ రియాక్ట్ అయ్యాడు.

సినిమాకు నెగటివ్ టాక్ వచ్చిన మాట నిజమేనని ఒప్పేసుకున్నాడు. ‘‘సినిమా టాక్ గురించి సోషల్ మీడియాలో ఒపీనియన్ తీసుకున్నా. 50 శాతం మందికి సినిమా నచ్చింది. 30 శాతం దాకా యావరేజ్ సినిమా అన్నారు. మరో 20 శాతంకి అస్సలు నచ్చలేదు. రెండో రోజు అది పడిపోయి చాలా మందికి సినిమా నచ్చలేదనే చెప్పారు. ఓవరాల్ గా వీక్ టాక్ తోనే సినిమా రన్ అవుతోంది’’ అని తెలిపాడు.

అయితే మౌత్ టాక్ తో సినిమాకు మున్ముందు ఆదరణ పెరగొచ్చన్న ఆశాభావం వ్యక్తం చేశాడు. ఒకవేళ అదే జరగకపోతే మాత్రం బయ్యర్లకు భారీ నష్టాలు తప్పవనే చెప్పాలి. మొత్తానికి తన సినిమా గురించి వస్తున్న వార్తలను నిజమేనని ఒప్పుకుని నితిన్ నిజాయితీని నిరూపించుకున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nithiin  LIE Movie  Negative Talk  

Other Articles