sandalwood actor trolled for tweet on venkaiah naidu నటుడిని విమర్శలపాలు చేసిన వెంకయ్యపై ట్విట్

Sandalwood actor trolled for tweet on venkaiah naidu

actor trolled by netzens, sandal wood actor trolled by netzens, sandalwood actor, jaggesh, trolled, twitter, tweet, elected vice president, venkaiah naidu, non-Kannadiga, social media

sandalwood actor jaggesh trolled on twitter for his tweet on elected vice president venkaiah naidu

నటుడికి కష్టాలు తీసుకోచ్చిన వెంకయ్యనాయుడు

Posted: 08/07/2017 03:34 PM IST
Sandalwood actor trolled for tweet on venkaiah naidu

దేశ ఉప రాష్ట్రపతిగా, రాజ్యసభ చైర్మెన్ గా ఎన్నికైన వెంకయ్యనాయుడును అభినందిస్తూ ఓ నటుడు చేసిన ట్విట్ పై విమర్శలు వెల్లువెత్తాయి. ఆ నటుడిపై కన్నడ ప్రజలు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. అభిమానం వుంటే సరే కానీ మమ్నల్ని ఊటంకిస్తూ విమర్శలు కురిపిస్తావా..? అంటూ నెట్ జనులు ఆనయపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మ్యాటర్ లోకి ఎంటరైతే.. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన వెంకయ్య నాయుడును.. కన్నడ నటుడు జగ్గేశ్‌ ట్విటర్ వేదికగా అభినందనలు తెలిపారు.

అయితే అంతటితో అగని జగ్గేశ్ తన ట్విట్టర్ పోస్లులో గతంలో చోటుచేసుకున్న విషయాలను కూడా ఊటంకించమే ఆయనను విమర్శలపాటు చేసింది. రాష్ట్రేతరుడైన వెంకయ్యను కర్ణాటక రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపేందుకు వ్యతిరేకిస్తూ గతంలో చోటుచేసుకున్న నిరసనలు, ఆందోళనలను కూడా ఆయన ప్రస్తావించారు. రాష్ట్రం నుంచి కన్నడీగ కానీ వ్యక్తిని రాజ్యసభకు పంపవద్దని అందోళనలు, నిరసలతో వ్యతిరేకించిన వ్యక్తి ఇవాళ దేశ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారని ఇది తమ రాష్ట్రానికి గర్వకారణమని జగ్గేశ్ తన ట్విట్ లో పేర్కొన్నారు.

అంతే జగ్గేశ్ ట్విట్ పై అన్నివర్గాల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. జగ్గేశ్‌ చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా కన్నడ ప్రజలను అవమానించే విధంగా ఉన్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో విమర్శలు ఎదుర్కోన్నారు. మీకు వెంకయ్యనాయుడిపై అభిమానం వుంటే దానిని నేరుగా వ్యక్తపర్చండీ కానీ.. ఇలా సొంత రాష్ట్ర ప్రజలను అవమానించే విధంగా ట్విట్ చేయడం సమంజసం కాదని పలువురు నెట్ జనులు సూచించారు. ఇదే క్రమంలో ఆయనను నెట్ జనులు తీవ్రంగా తూలనాడటంతో ఆయన చేసేంది లేక తన ట్వీట్ ను తొలగించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sandalwood actor  jaggesh  trolled  twitter  tweet  elected vice president  venkaiah naidu  social media  

Other Articles