Tollywood Hero injured in Malaysia Safe

Manchu hero recover from accident

Manchu Vishnu, Manchu Vishnu Accident, Manchu Vishnu Health, Manchu Vishnu Tweets, Manchu Vishnu ICU, Achari Accident in Malaysia, Manchu Hero Accident, Tollywood Hero Vishnu Accident

Actor Manchu Vishnu, elder son of Mohan Babu is injured in a road accident in Malaysia. Vishnu had reportedly fallen off from his bike at high speed, suffered injuries and is admitted to a hospital.

మంచు విష్ణు క్షేమంగానే ఉన్నాడు

Posted: 07/31/2017 10:17 AM IST
Manchu hero recover from accident

టాలీవుడ్ హీరో మంచు విష్ణు ప్రమాదానికి గురయిన విషయం తెలిసిందే. కొత్త సినిమా ‘ఆచారి అమెరికా యాత్ర’ షూటింగులో భాగంగా యాక్సన్ స్టంట్ లో పాల్గొంటున్న సమయంలో అతడికి యాక్సిడెంట్ జరిగింది. బైక్ రేసు సీన్ షూట్ చేస్తుండగా.. అదుపు తప్పి ప్రమాదానికి గురైనట్లు తెలిసింది. ఆపై ఐసీయూలో విష్ణు అంటూ పెద్ద పెద్ద హెడ్డింగ్ లతో కథనాలు వెలువడ్డాయి. అయితే అతనికి అయిన యాక్సిడెంట్ అంత ప్రమాదకరమైంది కాదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

ప్రస్తుతం మలేషియాలోని పుత్రజయ ఆసుపత్రిలో విష్ణు చికిత్స పొందుతున్నాడని, అతని పరిస్థితి సేఫ్ గానే ఉందని వైద్యులు, కుటుంబ సభ్యులు చెప్పేశారు. ‘దేనికైనా రెడీ’.. ‘ఈడోరకం ఆడోరకం’ లాంటి హిట్లు ఇచ్చిన జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో విష్ణు ‘ఆచారి అమెరికా యాత్ర’ చేస్తున్నాడు. గతంలో ‘విక్రమార్కుడు’ సహా పలు భారీ సినిమాలు నిర్మించి.. ఆ తర్వాత గ్యాప్ తీసుకున్న సీనియర్ నిర్మాత ఎం.ఎల్.కుమార్ చౌదరి మళ్లీ ఈ చిత్రంతో టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు.

దీనిపై విష్ణు భార్య వెరోనికా, తండ్రి మోహన్ బాబు, సోదరి మంచు లక్ష్మీ ప్రసన్న, సోదరుడు మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. దేవుడి దయవల్ల పెను ప్రమాదం నుంచి తన కుమారుడు బయటపడ్డాడని మోహన్ బాబు తెలిపారు. తమ సోదరుడు కోలుకోవాలని కోరుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలని లక్ష్మి, మనోజ్ తెలిపారు. గాయపడినా సురక్షితంగా ఉన్నారని చెప్పారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు విష్ణు బైక్ వెనుక హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కూర్చుని ఉందని, ఆమెకు ఏం కాలేదని దర్శకుడు బీవీఎస్ రవి తెలిపాడు. మన టాలీవుడ్ హీరో త్వరగా కొలుకోవాలని మనమూ కోరుకుందాం. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manchu Vishnu  ICU  

Other Articles