Senior Lyricist faults RGV over Compare Charmi with Patriot

Jonnavithula comments on rgv comparison

Tollywood Writer, Jonnavithula Ramalingeswara Rao, Jonnavithula RGV, RGV Jonnavithula, RGV Charmi Jhansi Laxmi Bhai, Charmi patriot Varma, Varma Charmi, Varma Hails Charmi SIT Probe, Jonnavithula Slam RGV, Jhansi Lakshmi Bai Varma Comments, Writer satire varma

Lyricist Jonnavithula Ramalingeswara Rao slammed director Ram Gopal Varma, for comparing actress Charmee with Jhansi Lakshmi Bai. She gave up her life fighting with the British, whereas Charmi was dragged to SIT office, for her involvement in drug case, he reminded.

ఛార్మీ ఝాన్సీ లక్ష్మీ.. వర్మకు జొనవిత్తుల కౌంటర్

Posted: 07/27/2017 01:03 PM IST
Jonnavithula comments on rgv comparison

తెలంగాణ ప్రభుత్వంపై, ఎక్సైజ్ శాఖ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న దర్శకుడు రాంగోపాల్వర్మ టాలీవుడ్ కు అండగా మెసేజ్ లు పంపుతున్న విషయం తెలిసిందే. తన టీం వర్క్ అయిన పూరీ తో సహా మిగతా వారందరినీ డిఫెండ్ చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో నిన్న సిట్ విచారణ సందర్భంగా చార్మీ బిహేవియర్ ను ఓ రేంజ్ లో పొగిడిపడేశాడు. టీవీ చానళ్లలో ఛార్మీని చూస్తుంటే..వీరనారి ఝాన్సీ లక్ష్మీ బాయి గుర్తోచ్చిందటూ వ్యాఖ్యలు చేయగా, దానికి వెంటనే కౌంటర్ పడింది.

సీనియర్ గేయ రచయిత జొన్నవిత్తుల వర్మపై ఓ రేంజ్ లో మండిపడ్డాడు. ఛార్మిని చూస్తుంటే వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయిలాగా ఉన్నది అని. ఇంతకుపూర్వం కన్నా చాలా అందంగా కనిపించిందని అన్నారు. అది చాలా ఇబ్బందికరమైన వ్యాఖ్య. ఆయన దాన్ని వెనక్కు తీసుకోవాలి. ఎందుకంటే, చార్మి వీరనారి కాదు. సిట్ అధికారులు ఆంగ్లేయులు కాదు. ఓ డ్రగ్ నేరారోపణలో అనుమానితురాలిగా ఆవిడను పిలిచి, వాళ్లు విచారణ చేస్తున్నారు. ఆ విచారణ ముగించుకుని బయటకు వచ్చినప్పుడు, ఆవిడ నిబ్బరంగా ఉందని అనొచ్చు. లేకుంటే, మరో విధంగా ఆమెను ప్రశంసించొచ్చు. దానికేమీ ఎవరికీ అభ్యంతరాలు ఉండవుగానీ, ఒక ఝాన్సీ లక్ష్మీబాయిలా కనిపించిందనడం ఇబ్బందికరమైన వ్యాఖ్యని తెలిపాడు.

 

దేశ ప్రజలు అందరూ కూడా ఝాన్సీని దేశభక్తికి ప్రతీకగా, ప్రతినిధిగా ఆరాధారిస్తారు. చార్మీ ఝాన్సీలా కనిపించిందంటే, ఆమెలో అందం కనిపించకూడదు. సాహసం, పరాక్రమం, త్యాగం... ఇవి కనిపించాలి. అలా కాకుండా, ఇలా వ్యాఖ్యానించడం, చాలామందిని కోపావేశాలకు గురి చేస్తుంది. ఈ వ్యాఖ్యలు వెనక్కు తీసుకుంటే బాగుంటుంది. సిట్ పై ఆయన అభిప్రాయాలను చెప్పవచ్చు. కానీ, దేశభక్తురాలితో చార్మిని పోల్చడం తగదు. రాంగోపాల్వర్మ ప్రతిష్ఠకూ మచ్చగా మిగులుతుంది" అని జొన్నవిత్తుల ఓ మీడియా ఛానెల్ తో పేర్కొన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RGV  Charmi  Jhansi Lakshmi Bai Comments  Jonnavithula  

Other Articles