పవన్ కొడుకు హైట్.. హాట్ టాపిక్ | Akira Nandan Bigger than Power Star Now

Pawan kalyan spotted with three kids at airport

Pawan Kalyan, Pawan Kalyan Son, Pawan Kalyan Akira, Pawan Kalyan Akira Hight, Pawan Kalyan Akira Nandan, Pawan Kalyan Son Movies, Akira Nandan Movie, Pawan Spotted Family at Airport, Pawan Kalyan Three Kids, Akira Nandan Future Power Star

Power Star Pawan Kalyan flew down to Hyderabad after completion of the Bulgarian schedule for his upcoming film in Trivikram’s direction.

పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా షాకిచ్చాడుగా...

Posted: 07/25/2017 05:18 PM IST
Pawan kalyan spotted with three kids at airport

పవన్ కళ్యాణ్ తన కొత్త చిత్రం కోసం బల్గేరియా రాజధాని సోఫియాకు వెళ్లిన విషయం తెలిసిందే. సాధారణంగా పవర్ స్టార్ సినిమా షూటింగ్ లకు ఫ్యామిలీ మెంబర్స్ ను తీసుకెళ్లడు. కానీ, ఈసారి ఎందుకనో భార్య అన్నా లెజెనోవా, కూతురు పోలెనాతోపాటు మాజీ భార్య కొడుకు అకీరా, కూతురు ఆద్యలను కూడా వెంటపెట్టుకుని వెళ్లాడు.

ఎయిర్ పోర్ట్ లో కొన్ని ఫోటోలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయ్. ఇందులో హాట్ టాపిక్ గా మారింది అకీరా నందన్ ఫోటో. పవన్ కన్నా ఒక అడుగు ఎత్తులో ఉన్న అకీరా ను చూసి అప్పుడే ఇంత ఎదిగిపోయాడా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాడు. పుణే లో గుట్టుచప్పుడుగా తల్లి రేణు దేశాయ్ దగ్గర పెరుగుతున్న అకీరా ఈ మధ్య మీడియాలో కనిపించిన దాఖలాలు లేవు. అలాంటిది 13 ఏళ్ల అకీరా సడన్ గా ఒక్కసారిగా ఇలా కనిపించే సరికి హాట్ టాపిక్ అయిపోయాడు.

సాధారణంగా స్టార్ హీరోల పిల్లలు టీనేజీలోకి రాగానే వాళ్ల తెరంగేట్రం గురించి చర్చ మొదలైపోతుంది. అలాంటిది పవన్ కొడుకు అంటే అది మరింత ఎక్కువగానే ఉంటుందనుకోవాలి. మరి ఆ విషయంలో పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. ఆ సంగతి పక్కన పెడితే సాయంత్రం వరకు షూటింగ్ లో పాల్గొని ఆపై కుటుంబంతో షాపింగ్ చేస్తూ పిల్లలతో సరదాగా గడిపే ఫ్లాన్ చేసుకున్నాడంట పవన్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Akira Nandan  Bulgaria Tour  

Other Articles