మేనేజర్ తో క్లోజ్ గా ఉంటే డ్రగ్ తీసుకున్నట్లేనా? | I am Unaware of My Manager Drug Addiction Kajal

Kajal reacts on manager arrest

Kajal Agarwal, Kajal Agarwal Reaction, Kajal Agarwal Drug Addiction, Kajal Agarwal on Manager Arrest, Kajal Agarwal Manager Roni Links, Kajal on Manager Arrest, Kajal manager Arrest, Tollywood Drug Case Kajal

Kajal Agarwal responded on Manager Roni's Arrest. Says she will never support that addiciton which hazardous to Society.

డ్రగ్స్ రాకెట్ తో నాకేం సంబంధం లేదు: కాజల్

Posted: 07/25/2017 02:27 PM IST
Kajal reacts on manager arrest

డ్రగ్స్ వ్యవహారంలో ఎక్సైజ్ సిట్ విచారణతో ఇప్పటికే సెలబ్రిటీలు గజగజలాడిపోతున్నారు. ఇదిలా ఉండగానే టాప్ హీరోయిన్ కాజల్ మేనేజర్ రోనీ అలియాస్ రాన్ సన్ జోసెఫ్ ను ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేయటంతో ఒక్కసారిగా టాలీవుడ్ ఉలిక్కి పడింది. కాజల్ తోపాటు రాశీఖన్నా, లావణ్య త్రిపాఠిలకు వద్ద కూడా రోనీ మేనేజర్ గా పనిచేయటంతో ఈ వ్యవహారంలో హీరోయిన్లకు కూడా హ్యాండ్ ఉందా? అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

దీంతో డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో త‌న మేనేజ‌ర్ జానీ జోసెఫ్ అలియాస్ రోనీ అరెస్ట్‌పై న‌టి కాజ‌ల్ అగ‌ర్వాల్‌ ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించింది. రోనీ అరెస్టు విష‌యం తెలిసి తాను షాక్ అయిన‌ట్లు, రోనీ వృత్తిప‌రంగా తెలిసినంత మాత్రాన అతని వ్య‌క్తిగ‌త విష‌యాల‌తో త‌న‌కు ఎలాంటి సంబంధం ఉండ‌ద‌ని కాజ‌ల్ స్ప‌ష్టం చేసింది. `రోనీ అరెస్టు విష‌యం తెలిసి మొద‌ట నేను షాక‌య్యాను. స‌మాజానికి హాని క‌లిగించే ఇలాంటి వారికి నేను మ‌ద్ద‌తు ప‌ల‌క‌ను.

‘‘నా వృత్తిప‌ర ప‌నుల్లో స‌హాయం చేసే వారిని నేను బాగా చూసుకుంటున్నంత మాత్రాన వారి వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను నియంత్రిస్తున్నాన‌ని కాదు. ఒక్క మా త‌ల్లిదండ్రులు మిన‌హా ఇండ‌స్ట్రీలో నాకు స‌హాయం చేసే వారంద‌రితోనూ నేను కేవ‌లం వృత్తిప‌ర స్నేహ‌మే కొన‌సాగిస్తాను. ఒక్క‌సారి వారితో వృత్తిప‌ర అవ‌స‌రాలు తీరిపోయాక వారి స్థితిగ‌తుల గురించి నేను ప‌ట్టించుకోను` అని కాజ‌ల్ పోస్ట్ చేసింది. తనపై వస్తున్న పలు రూమర్లకు ఇలా ఒక్క ట్వీట్ తోనే ఆన్సర్ ఇచ్చేసింది కాజల్. ఇక సిట్ విచారణలో భాగంగా ఆర్ట్ డైరక్టర్ చిన్నా విచారణ కొనసాగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kajal Agarwal  Manager Arrest  Drug Case  

Other Articles