సిట్ విచారణపై ఛార్మీ పిటిషన్ | Charmi Petition on Collect Blood Sample Not Fair

Charmi approached hc in drug case

Charmi Kaur, Charmi Kaur High Court, Charmi Kaur HC Petition, Charmi Kaur Blood Samples, Charmi Kaur SIT Probe, Charmi Kaur Drug Case SIT, Charmi High Court Petition , Charmi Petition Quash

Actress Charmi Kaur Approach High Court In Drugs Case, Objection In Collection Of Blood Samples . Also Challenges SIT Notices not Properly.

డ్రగ్ కేసులో ఛార్మీ.. హైకోర్టులో పిటిషన్

Posted: 07/24/2017 12:44 PM IST
Charmi approached hc in drug case

డ్రగ్ కేసు విచారణలో భాగంగా తన వంతు రాబోతున్న తరుణంలో నటి ఛార్మీ కౌర్ ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టును ఆశ్రయించింది. డ్రగ్స్ వ్యవహారంలో ఎక్సైజ్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ సిట్ పంపించిన నోటీసుల ఆధారంగా ఆమె రిట్ పిటిషన్ దాఖలు చేసింది. విచారణ తీరు సరిగ్గా లేదంటూ ఆమె అందులో పేర్కొంది.

ఆర్టికల్ 20 సబ్ క్లాజ్ 3 ప్రకారం బలవంతంగా తన నుంచి బ్లడ్ శాంపిల్స్ ను సేకరించవద్దంటూ పిటిషన్ లో కోరింది. రక్త నమూనాల సేకరణ అన్నది అసలు సరైన పద్ధతి కాదని తెలిపింది. అంతేకాదు సిట్ విచారణకు తనతో పాటు లాయర్ ను కూడా లోపలికి తీసుకెళ్లేందుకు అనుమతించాలంటూ విజ్నప్తి చేసింది. తనకు డ్రగ్స్ వాడే అలవాటు లేకున్నప్పటకీ, నోటీసులు జారీ చేశారని... ఇది ఎంతవరకు సబబని ప్రశ్నించింది.

సిట్ అధికారుల తన పరువుకు భంగం కలిగించేలా ఉందని చెప్పింది. ఈ నెల 26వ తేదీన ఆమె సిట్ విచారణను ఎదుర్కోబోతోంది. మరోవైపు, ఛార్మిని ఎక్సైజ్ కార్యాలయానికి పిలిపించకుండా, ఆమె ఉన్న చోటుకే వెళ్లి విచారించే అవకాశాలున్నాయనే అధికారులు నోటీసులు జారీ చేసిన టైంలోనే హింట్ ఇచ్చారు కూడా. ఇక ఛార్మి వేసిన పిటిషన్ ఆధారంగా అకున్ సబర్వాల్, చంద్రవదన్ తోపాటు ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి నోటీసులు జారీ అయ్యాయి. రేపు ఈ రిట్ పిటిషన్ విచారణకు రానుంది.

ఛార్మి తొందరపడిందా?

డ్రగ్స్ కేసులో సిట్ విచారణలో వరుసగా పూరీ జగన్నాథ్, శ్యామ్ కే నాయుడు, సుబ్బరాజు, తరుణ్ లను గంటల తరబడి విచారించిన సిట్ అధికారులు ఇవాళ కీలకంగా భావిస్తున్న నవదీప్ ను విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన విచారణ మొదలవ్వక ముందే ఛార్మీ హైకోర్టునాశ్రయించడంపై సినీ పరిశ్రమలో భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. డ్రగ్స్ ను నిర్మూలించాల్సిందేనన్న పిలుపు మేరకు టోటల్ ఇండస్ట్రీ ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించింది. అందుకే అంతా సైలెంట్ గా సిట్ ముందు హాజరయి, బయటికొచ్చాక(లోపలేం జరిగిందో తెలీదు కాబట్టి) డ్రగ్స్ ను ఖండిస్తున్నట్లు ప్రకటిస్తున్నారు.

డ్రగ్స్ తీసుకుంటే మూడు నెలలలోపు దాని ఆనవాళ్లు వెంట్రుకలు, గోళ్లలో మినహా ఎక్కడా తెలియవు. అందుకే ఆ విషయాన్ని నిర్ధారించేందుకు సిట్ వారి రక్త నమూనాలు సేకరిస్తోంది. ఒకవేళ చార్మీ ఈ మూడు నెలల్లోగా డ్రగ్స్ వాడివుంటే ఆ విషయం బయటకు వస్తుంది. అందువల్లే తాను రక్తాన్ని, గోళ్లు, వెంట్రుకల నమూనాలను ఇవ్వలేనని కోర్టును ఆశ్రయించినట్టు న్యాయ నిపుణులు భావిస్తున్నారు. ఛార్మీ మాత్రం పలు షరతులతో తనను విచారించాలని కోరింది. దీంతో ఆమె రీసెంట్ గా డ్రగ్స్ సేవించిందా? అన్న కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఒక వేళ డ్రగ్స్ తీసుకుందని నిరూపణ అయితే ఆమెకు అవకాశాలు తగ్గడంతో పాటు ఆమె పరువు ప్రతిష్ఠలకు భంగం వాటిల్లుతుందని ఛార్మీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె తరపున న్యాయవాది విష్ణువర్థన్ హైకోర్టును ఆశ్రయించింది. సిట్ దగ్గర ఉన్న ఆధారాలను మీడియా ముందు ప్రవేశపెట్టాకే విచారణ ముందుకు సాగాలంటూ అతను వాదిస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tollywood  Charmi  SIT Probe  High Court Petition  

Other Articles