నితిన్ మూవీకి రికార్డు ధర | Fancy Price for Satellite Rights

Record price for nithiin s lie rights

LIE Movie, LIE Satellite Rights, Satellite Rights Nithin Movie, Nithiin LIE Movie, Nithiin New Movie, Nithiin Movie Rights, Nithiin Big Budget Movie, Satellite Rights Telugu Movies

Nithiin's upcoming flick 'LIE' is being directed by Hanu Raghavapudi and release date of the film is nearing but filmmakers have been pushing it across. Sources informed, Nithiin's LIE has bagged a whopping amount in its satellite lights. The makers are said to have closed the deal for Rs 7 crore, which is the highest ever, in the career of actor Nithiin.

నితిన్ లై కి బాగానే గిట్టుబాటు అవుతోందిగా...

Posted: 07/17/2017 01:30 PM IST
Record price for nithiin s lie rights

వరుసగా హిట్లు పడుతున్న టైంలో మధ్యలో ఓ రెండు ఫ్లాపులు రావటంతో నితిన్ మళ్లీ అలర్ట్ అయ్యాడు. త్రివిక్రమ్ , సమంతలతో కలిసి అ..ఆ... అంటూ మ్యాజిక్ చేసేశాడు. ప్రస్తుతం హను రాఘవపూడి డైరక్షన్ లో లై మూవీలో నటిస్తున్నాడు. నితిన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం టీజర్ ఈ మధ్యే రిలీజ్ అయ్యి దూసుకుపోతూ అంచనాలు భారీగానే పెంచేసుకుంది.

ఇక ఇప్పుడు భారీ రేటుకు శాటిలైట్ రేట్స్ కు అమ్ముడుపోయి మరో సెన్సేషన్ క్రియేట్ చేసింది. భారీ రేటుకు (దాదాపు 7 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం) ఓ ప్రముఖ ఛానెల్ హక్కులను సొంతం చేసుకుంది. నితిన్ సినిమాల్లో ఇప్పటిదాకా ఇదే హయ్యెస్ట్ ధర. వచ్చే నెల రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ కూడా అదే రేంజ్ లో జరగొచ్చనే చెబుతున్నారు.

మెజార్టీ పార్ట్ అమెరికాలో షూటింగ్ జరుపుకోగా, మేఘా ఆకాశ్ హీరోయిన్ గా డెబ్యూ ఇస్తోంది. సీనియర్ నటుడు అర్జున్ ఓ కీ రోల్ చేస్తున్నాడు. 14 రీల్స్ పై అనిల్ సుంకర, రామ్ మరియు గోపి అచంటలు 40 కోట్ల బడ్జెట్ తో దీనిని రూపొందించారు. ఆగష్టు 11న లై ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటే అక్కడ అబ్బాయి.. ఇక్కడ అమ్మాయి అనే సినిమాకు కూడా నితిన్ సైన్ చేయటం విశేషం. త్వరలోనే అదీ షూటింగ్ ప్రారంభం కాబోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nithiin  LIE Movie  Satellite Rights  

Other Articles