కస్తూరి టార్గెట్.. ఈసారి యంగ్ హీరోనే! | Kasturi Tamil Culture Comments Satire to Young Hero

Kasturi again controversy comments

Actress Kasthuri, Kasthuri Controversy Comments, Actress Kasthuri Kamal Haasan, Kasthuri Bigg Boss, Actress Kasthuri Tamil Culture

Actress Kasthuri target young hero this time. Made Tamil Culture Comments over Support Kamal Haasan Bigg Boss Show.

కమల్ కి కస్తూరి సోపోర్ట్.. ఆ యంగ్ హీరోకు పంచ్

Posted: 07/14/2017 12:04 PM IST
Kasturi again controversy comments

కాస్టింగ్ కౌచ్ ప్రస్తావన తెస్తూ ఓ సీనియర్ హీరోపై కామెంట్లు చేసి కలకలం రేపిన నటి కస్తూరి, ఈ మధ్య తరచూ వార్తల్లో ప్రముఖంగా కనిపిస్తోంది. ఆ మధ్య రజనీ రాజకీయ ప్రవేశంపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురి అయ్యింది. అయితే ఆయన పొలిటికల్ ఎంట్రీపై అంతగా ఆశలు పెట్టుకొవద్దని, ఖచ్ఛితంగా అందులో విఫలమవుతారనే తాను ఆ వ్యాఖ్యలు చేశానని, తన వ్యాఖ్యలతో బాధపడితే క్షమించాలంటూ చెప్పింది.

ఇక ఇప్పుడు మరో సీనియర్ హీరో కమల్ హసన్ పై ట్విట్టర్ లో ట్వీట్లు వేసింది. తమిళంలో ప్రసారమవుతున్న బిగ్ బాస్ షోను నిలిపేయాలని, తమిళ సంస్కృతిని నాశనం చేస్తోందంటూ కొందరు ఆందోళన చేస్తుండగా, కమల్ పై కేసు కూడా నమోదయ్యింది. ఈ నేపథ్యంలో కమలహాసన్ మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో కమలహాసన్ కు ప్రముఖ సినీ నటి కస్తూరి మద్దతుగా నిలిచింది.

కొన్ని సంఘాలు డిమాండ్ చేస్తున్నట్టు బిగ్ బాస్ పోటీదారులను అరెస్టు చేయాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు. ఆ వంద మంది 100 రోజులు అరెస్ట్ లోనే ఉంటారంటూ జోక్ పేలుస్తూనే.. మరోపక్క ‘సంస్కృతి తీవ్రవాదుల’నుంచి తమిళ సంస్కృతిని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. హిందూ మతం ఏ ఒక్కరి ఆస్తి కాదని, కంచె వేసి దానిని కాపాడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదని చెబుతోంది. అయితే ఆమె చేసిన వ్యాఖ్యలు ఓ ప్రముఖ యంగ్ హీరోను ఉద్దేశించినవేనంటూ మీడియా కథనాలు రాయటం విశేషం. పైగా కోలీవుడ్ లో తమిళ కల్చర్ ను పట్టించుకోకుండా అతని సినిమాలు ఉంటాయని చెబుతూ స్టోరీలు రాస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Kasthuri  Controversial Comments  Kollywood News  

Other Articles