Director No Media interaction for New Movie Promotion

Teja avoid media for new movie

Nene Raju Nene Mantri, Director Teja, Director Teja Promotions with out media., Director Not Interact Media, Director Teja Fear Media

Director Teja no media interaction for Nene Raju Nene Mantri Movie. How he promoted movie lets see.

మీడియా అంటే అంత భయం ఎందుకసలు?

Posted: 07/08/2017 06:17 PM IST
Teja avoid media for new movie

కెరీర్ ప్రారంభమే యూత్ ఫుల్ బ్లాక్ బస్టర్లతో టాప్ డైరక్టర్ల లిస్ట్ లో చేరిన తేజ తర్వాత అంతే స్పీడ్ గా చెత్త సినిమాలు తీసి దెబ్బతిన్నాడు. కనుమరుగు అయిపోతున్న జాబితాలో చేరకుండా ఉండాలంటే అందివచ్చిన అవకాశాన్ని అస్సలు మిస్ కావొద్దు. అందుకే రానా హీరోగా నటించిన నేనే రాజు నేనే మంత్రి హిట్ అయ్యి తీరాలి. ఆగష్టు 11న సినిమా విడుదల కానుంది. మరి చిత్ర ప్రమోషన్ల సంగతి ఏంటి?

అర్థం లేని ప్ర‌శ్న‌లు అడిగి త‌న‌ని వివాదాల పాలు చేసే మీడియాతో పెద్ద త‌ల‌నొప్పి అని ద‌ర్శ‌కుడు తేజ అన్నారు. అందుకే ప‌దేళ్ల వ‌ర‌కు మీడియాతో మాట్లాడ‌కుండా ఉండేందుకు ప్రయ‌త్నిస్తాన‌ని చెప్పారు. ఆయన ఇలా అన‌డాన‌కి కార‌ణం లేక‌పోలేదు. ఏ ప్ర‌శ్న‌కైనా సంకోచించ‌కుండా, సూటిగా స‌మాధానం చెప్పే తేజ మాట‌ల‌ను గ‌తంలో మీడియా చాలా సార్లు వ‌క్రీకరించింది. న‌టీన‌టుల‌ను చాలా ఇబ్బంది పెడ‌తాడ‌ని, ఒక ప‌ద్ధ‌తి లేకుండా షూటింగ్ చేస్తాడ‌ని పుకార్లు పుట్టించింది.

బ‌హుశా ఇలాంటి పుకార్లు `నేనే రాజు నేనే మంత్రి` సినిమాతో కూడా రాకూడ‌ద‌నే ఆయ‌న ఇలాంటి నిర్ణ‌యం తీసుకున్నారేమోన‌ని సినీవ‌ర్గాల అభిప్రాయం. ఇప్ప‌టికే టీజ‌ర్, ట్రైల‌ర్‌తో భారీ అంచ‌నాలు పెంచేసిన `నేనే రాజు నేనే మంత్రి` సినిమా ప్ర‌చార కార్య‌క్ర‌మాలు తాను పాల్గొనకుండా హీరోహీరోయిన్లతో చేయిస్తాడా? చూడాలి మ‌రి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nene Raju Nene Mantri  Director Teja  

Other Articles