Varma Convinced Balayya on NTR Biopic

Varma on ntr biopic behind scene

Ram Gopal Varma, Puri Jagnnadh Varma Balayya, Balakrsihna NTR Biopic, NTR Biopic Movie, Murali Mohan son-in-law Vishnu Induri, Vishnu Induri Deva Katta, Director Deva Katta Ram Gopal Varma, Varma Balayya Puri, Puri Behind NTR Biopic

Strong buzz in the T-town that Puri Jagannadh convinced Nandamuri Balakrishna to hand over NTR biopic to Ram Gopal VarmaRam Gopal Varma has been in talks with Balayya for three months to helm NTR’s biopic. The duo have been frequently meeting since the past three months and discussing this sensational project, which can create innumerable controversies if not dealt with carefully.

ఎన్టీఆర్ బయోపిక్: వర్మ విక్టరీ.. కంగారుపడాల్సిన పనిలేదు...

Posted: 07/05/2017 01:17 PM IST
Varma on ntr biopic behind scene

వంగవీటి లాంటి సినిమానే సరిగ్గా తీయలేకపోయాడు.. అలాంటిది తెలుగువారి ఆరాధ్య దైవం ఎన్టీఆర్ బయోపిక్ ను ఎలా తీస్తాడా? వర్మ వల్ల కాదంటూ... నిన్న సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఆర్జీవీపై నందమూరి ఫ్యాన్స్, మీడియాలో ఇలా అంతా ఓ రేంజ్ లోనే మండిపడుతున్నారు. పైగా రియల్ కాంట్రవర్సీ చూపిస్తానంటూ కంగారు పెట్టే స్టేట్ మెంట్లు ఇవ్వటంతో అది మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో అసలు బాలయ్యను వర్మ ఎలా ఒప్పించాడా? అన్న ప్రశ్న అందరి మైండ్ లో తిరగుతుతోంది.

కానీ, మూడు నెలల క్రితమే గ్రౌండ్ వర్క్ ను ప్రారంభించిన వర్మ ఇందుకోసం తన శిష్యుడు పూరీ సహకారం కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు పెద్ద స్టోరీతోనే ఇది వర్మ చేతిలోకి వెళ్లిందని చెబుతున్నారు పలువురు. సీనియర్ నటుడు, టీడీపీ ఎంపీ మురళీ మోహన్ అల్లుడు విష్ణు ఇందూరి సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాలని ఎప్పటి నుంచో ఫ్లాన్ లో చేస్తున్నాడు. అయితే అది ఎన్టీఆర్ బయోపిక్ తోనే కావాలని భావించి, ఇందుకోసం ప్రస్థానం దర్శకుడు దేవా కట్టాతో కలిసి ఓ పక్కా స్క్రిప్ట్ నే రూపొందించుకున్నాడు. బాలయ్యకు దాన్ని వినిపించేయటం, ఓకే చేయటంతో దర్శకుడి కోసం వేట మొదలైంది.

ఒకానోక టైంలో దేవా కట్టతోనే తీయించాలని భావించినప్పటికీ అనుభవలేమీ అడ్డొచ్చిందంట. తర్వాత ఎన్టీఆర్ తో పని చేసిన రాఘవేంద్ర రావు లాంటి సీనియర్ల దగ్గరి నుంచి ఇప్పుడున్న కొత్త దర్శకుల పేర్లను కూడా పరిశీలించి అందరితోనూ బాలయ్య సంప్రదింపులు కూడా చేసినట్లు సమాచారం. అయితే వివాదాస్పద అంశాలకు భయపడి ఏ ఒక్కరూ ముందుకు రాలేదని తెలుస్తోంది. అదే టైంలో పూరీతో పైసా వసూలు షూటింగ్ లో ఉన్న బాలయ్య తో వర్మ సిట్టింగ్ లు వేయటం, ఎట్టకేలకు వివాదాల దర్శకుడి చేతికే లెజెండరీ బయోపిక్ వెళ్లటం జరిగిపోయాయన్నది టాక్. అయితే పవర్ ఫుల్ స్క్రిప్ట్ లు అందిస్తాడనే దేవ కట్టాపై ఓ పేరుంది. ఈ లెక్కన వర్మ జస్ట్ డైరక్షన్ కాబట్టి కథ గురించి కంగారు పడాల్సిన అక్కర్లేదని విశ్లేషకులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Gopal Varma  NTR Biopic  Balakrishna  Puri Jagannadh  

Other Articles