RGV shows Real Controversy with NTR Biopic

Rgv direct ntr biopic

Ram Gopal Varma, RGV NTR Biopic, Balyya RGV Meet, RGV Balayya NTR Biopic, Balayya Refuse RGV, Balayya Refuse Varma for NTR Biopic, NTR Biopic Balayya, RGV NTR Biopic Balayya or Not

RGV To Direct Balakrishna for NTR Biopic. Varma Confirms in Audio tape and officially announced after meet with Balayya.

వర్మ చేతికి ఎన్టీఆర్ బయోపిక్.. బాలయ్యేనా? కాదా?

Posted: 07/04/2017 02:25 PM IST
Rgv direct ntr biopic

తెలుగు వారి ఖ్యాతిని దేశం నలుమూలలా వ్యాప్తి చెందించటమే కాదు, హస్తిన రాజకీయాలను మలుపు తిప్పిన ఏకైక వ్యక్తి స్వర్గీయ నందమూరి తారకరామారావు. తెలుగువాడి ఆత్మగౌరవం పేరిట ప్రత్యేక పార్టీ నెలకొల్పి ప్రభంజం రేపుతూ ఘన విజయం సాధించి చరిత్రలో కొత్త అధ్యయనం లిఖించాడు. అలాంటి మహానుభావుడి జీవిత చరిత్రను తెరకెక్కిస్తున్నట్టు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే.

అంతేకాదు తన వాయిస్ ఓవర్ తో 'జై ఎన్టీఆర్' పాటను విడుదల చేశాడు. ఎన్టీఆర్ సినిమాను ఎందుకు తీస్తున్నానో వివరిస్తూ ఆయన ఓ ఆడియో విడుదల చేశాడు. ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు తెలుగువాడిని తలెత్తుకునేలా చేశాయని వర్మ తెలిపాడు. ఎన్టీఆర్ పేరు వింటేనే స్వాభిమానం తన్నుకొస్తుందని... ఛాతి గర్వంతో ఉప్పొంగుతుందని చెప్పారు. ఆయన మహా నటుడే కాదని... మన తెలుగు నేల ఆయనకు ముందు, ఆయన తర్వాత కూడా అత్యధిక ప్రజాదరణ కలిగిన అంతటి రాజకీయ నేతను చూడలేదని పేర్కొన్నాడు.

ఎన్టీఆర్ తో ఉన్న వ్యక్తిగత అనుబంధం ఏమిటంటే... ఆయన నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'అడవిరాముడు'ను తాను 23 సార్లు చూశానని తెలిపాడు. ఆయన సినిమా చూసేందుకు బస్సు టికెట్ కు డబ్బుల్లేక, 10 కిలోమీటర్లు నడిచి థియేటర్ కు వెళ్లానని చెప్పాడు. ఎన్టీఆర్ నిర్వహించిన టీడీపీ తొలి మహానాడుకు లక్షలాది మంది తరలి రాగా అందులో తాను కూడా ఉన్నానని వర్మ తెలిపాడు. అంతటి సామాన్యుడినైన తాను... ఇప్పుడు ఆ మహానుభావుడి బయోపిక్ ను తెరకెక్కించడం పట్ల చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానని చెప్పాడు.

'ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని' అని రాయప్రోలుగారు అంటే... ఓ సినిమా దర్శకుడిగా కాకుండా ఎనిమిది కోట్ల తెలుగు ప్రజల్లో ఒకడిగా ప్రపంచంలో నలు మూలలా ఉన్న తెలుగువారందరికీ 'ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి తెలుగు భారతిని, పొగడరా నీ తండ్రి ఎన్టీఆర్ ను' అని పాడమని చెబుతానని తన అభిమానాన్ని చాటుకున్నాడు. సినిమాలో ఆయన శత్రువులెవరో? అసలు మిత్రులెవరో అన్నది కూడా క్లారిటీగా చూపిస్తానని, అసలు కాంట్రవర్సీ అంటే ఏంటో ఈ సినిమాలో ప్రేక్షకుడు చూస్తాడని అంటున్నాడు.

అయితే ఈ విషయంలో ఇప్పటికే స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని ఇది వరకే బాలయ్య చెప్పిన విషయం తెలిసిందే. మరి అసలు వర్మ కు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా? అసలు హీరో బాలయ్యేనా? లేక మరెవరైనానా? ఇస్తే తెరపై వర్మ ఎలా తెరకెక్కించబోతున్నాడు? వివాదాలు లేకుండా ఎలా చూపిస్తాడు? ఇలా నందమూరి అభిమానుల్లో అప్పుడే అనుమానాలు మొదలయ్యాయి. వీటన్నింటికి రేపు బాలయ్య తో భేటీ అయ్యాక ఓ క్లారిటీ లభించే ఛాన్స్ ఉంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR Biopic  Balakrishna  Ram gopal Varma  

Other Articles

Today on Telugu Wishesh