Clash with MCA Director DOP Diwakar Mani walks out

Cinematographer out from nani movie

Director Venu Sriram, DOP Diwakar Mani, Nani DOP Walks Out, Cinematographer Change, Nani MCA Movie, Tollywood Technicians Change, Venu Sriram Diwakar Mani, NAni Director Clash DOP, Cinematographer Changed

Cinematographer walks out of Nani’s MCA. Venu Sriram and Diwakar Mani had several clashes on the sets after which Diwakar Mani called it a quit. The makers are said to have roped in another cinematographer for the film and an official announcement is awaited.

నాని మూవీ నుంచి అతన్ని తీసేశారా?

Posted: 07/03/2017 03:18 PM IST
Cinematographer out from nani movie

ఇగోలతో టెక్నీషియన్ల మధ్య గొడవలు రావటం టాలీవుడ్ లో ఇప్పుడు కామన్ గా మారిపోయింది. కాస్టింగ్ దగ్గరి నుంచి ఏకంగా దర్శకులనే మార్చేసిన సినిమాలు బోలెడు. స్టార్ల సినిమాల
విషయంలోనే ఇది మరీ ఎక్కువగా జరుగుతోంది. తమకు కావాల్సిన అవుట్ పుట్ ఇవ్వకపోవటమో, లేక ఏ ఇతర కారణాల వల్లనో జరుగుతున్నప్పటికీ, క్వాలిటీ విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ కావట్లేదు.

ఇదిలా ఉంటే ఇప్పుడీ వ్యవహారం నాని సినిమాకు కూడా పాకిపోయింది. నేచురల్ స్టార్ తన కొత్త చిత్రం ఎంసీఏ(మిడిల్ క్లాస్ అబ్బాయి) షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. దిల్ రాజు బ్యానర్ లో వేణు శ్రీరామ్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా కోసం నిఖిల్ ‘కేశవ’ ఫేమ్ దివాకర మణిని ముందుగా సెలక్ట్ చేశారు. అల్రెడీ షూటింగ్ లో కూడా ఇతగాడు పాల్గొంటున్నాడు. అయితే డైరక్టర్ తో సెట్ లో తరచూ గొడవలు పడుతున్నాడని, అందుకే అతన్ని తీసేశారన్న టాక్ వినిపిస్తోంది.

దీనిపై అఫీషియల్ ప్రకటన లేకపోయినా ఆ స్థానంలో మరో కెమెరామెన్ త్వరలోనే షూటింగ్ లో జాయిన్ అవుతాడని చెప్పుకుంటున్నారు. సాయి పల్లవి హీరోయిన్ గా, దేవీ శ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని ఈ యేడాది చివర్లోనే తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరో పక్క ఈ శుక్రవారమే నాని నిన్ను కోరి రిలీజ్ కు రెడీగా ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actor Nani  MCA Movie  DOP Diwakar Mani  

Other Articles