Varma same love on Pawan and Pornstars

Rgv again comments on power star

Ram Gopal Varma, Director Varma, Varma Pawan Minus, RGV Pawan Kalyan, Pawan kalyan Porn Stars, Pawan Ram Gopal varma, Pawan Tweets Lift Books, Pawan Tweets Unnatural, RGV Feels on Pawan Tweets, Pawan Kalyan Tweets Not Effect

Ram Gopal Varma compare Pawan Kalyan with Porn Stars. He feels Pawan Kalyan is more powerful than his tweets. The language he speaks on public platforms is different from the language which he uses in his tweets. They miss his natural intensity.

పవన్, పోర్న్ స్టార్ పై వర్మ సేమ్ ప్రేమ

Posted: 07/03/2017 01:03 PM IST
Rgv again comments on power star

మెగా ఫ్యామిలీలో హీరోలను టార్గెట్ చేసీ ఆ మధ్య పెద్ద రచ్చే రేపిన వర్మ పవర్ స్టార్ ను కూడా వదల్లేదు. సినిమాలు, రాజకీయాలు ఇలా ప్రతీ దాంట్లోనూ పవన్ ఘోరంగా ఫేలవుతున్నాడంటూ మొదలుపెట్టి.. ఆపై టాపిక్ ను మరింత ముదిరేలా చేసి ఫ్యాన్స్ నుంచి తిట్టు తిన్నాడు. చివరకు ట్విట్టర్ అకౌంట్ ను క్లోజ్ చేసే ముందు క్షమాపణలు చెబుతూ వివాదాలకు ముగింపు పలికేశాడనుకోండి. మరి అలాంటప్పుడు ఇప్పుడు పవన్ పై చేసిన మెసేజ్ లు ఎక్కడి నుంచి వస్తున్నాయ్..

రీసెంట్ గా ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కింది వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. తన దృష్టిలో పవన్, పోర్న్ స్టార్లు ఇద్దరూ ఒక్కటేనని కామెంట్ చేశాడు. దూరం నుంచి ఇద్దరూ నా దృష్టిలో ఒకటేనని, అదే దగ్గరికి వెళ్లి పరిశీలిస్తే వాళ్ల లోపాలు స్పష్టంగా కనిపిస్తాయంటూ చెబుతున్నాడు. అయితే చేసింది తిక్క కామెంట్ అయినా దానికో లెక్క ఉందంటూ సుదీర్ఘ వివరణే ఇచ్చుకున్నాడు. పవన్ చాలా పవర్ ఫుల్ వ్యక్తి అన్న వర్మ సభల్లో మాటలకు, ట్వీట్లకు ఏ మాత్రం పొంతన ఉండదంటున్నాడు.

సపోజ్.. రామారావు గార్ని తీసుకోండి. స్క్రీన్ మీద ఎంత ఎఫెక్ట్ చూపించారో.. తర్వాత రాజకీయాల్లోనూ అంతే బలమైన ముద్ర వేశారు. తర్వాత చిరంజీవి ఆ పని చేస్తాడేమో అనుకున్నప్పటికీ అద జరగలేదు. కానీ, పవన్ కళ్యాణ్ లో ఆ లక్షణాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ప్రజా భేటీల్లో పవన్ మాటలు సాలిడ్ గా, ప్రేరణ కలిగించేవిగా ఉంటాయి. కానీ, ట్వీట్ల వరకు వచ్చేసరికి సహజత్వం కోల్పోయి,  ఏదో బుక్ నుంచి కాపీ కొడుతున్నాడా? అన్న అనుమానాలు కలుగుతాయి అంటూ వర్మ తెలిపాడు. అయితే సోషల్ మీడియాలో తాను యాక్టివ్ గా లేకపోయినా ఇలా ఛాన్స్ దొరికినప్పుడల్లా మాత్రం పవన్ పై తన ఓపినీయన్ చెప్పటం మాత్రం మాననని కుండ బద్ధలుకొట్టినట్లు చెబుతున్నడీ వివాదాల దర్శకుడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Ram Gopal Varma  Political Mistakes  

Other Articles