Venky Director to Direct Kollywood Hero Suriya

Suriya movie with lady director

Suriya, Suriya New Movie, Suriya Lady Director, Suriya Sudha Kongara, Sudha Kongara New Movie, Venky Director Suriya, Suriya 2018 Movies, Suriya Guru Director, Suriya Fish Hunter

Guru Movie Director Sudha Kongara to Direct Kollywood Star Suriya. After Complete Vignesh Shivan movie Suriya proceed with this mass entertainer.

లేడీ డైరక్టర్ తో సూర్య.. హిట్ కోసం ఊరమాస్ రోల్

Posted: 06/30/2017 04:17 PM IST
Suriya movie with lady director

టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ కు సోలో హిట్ లేక సతమతమవుతున్న టైంలో గురు అంటూ మంచి విక్టరీనే అందించింది లేడీ డైరక్టర్ సుధా కొంగర. మణి రత్నం శిష్యరికంలో ఆరితేరి ఆపై షార్ట్ ఫిల్మ్ లు చేసిన సుధా 2010 లో ద్రోహితో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆపై మాధవన్ తో ఇరుది సుట్రు( సాలా ఖడ్డూస్) తీసి క్రిటిక్స్ నుంచి ప్రశంసలు అందుకుంది.

మళ్లీ అదే సినిమాను గురుగా తెలుగులో తీసి పెద్ద హిట్టే కొట్టింది. ప్రస్తుతం సుధా మరో బంఫర్ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తో ఓ సినిమా తీసేందుకు సిద్ధమైపోతుందంట. ఇప్పటికే స్టోరీ లైన్ వినేసిన సూర్య గ్రీన్ సిగ్నల్ ఇఛ్చేయగా, స్క్రిప్ట్ పనులు ప్రారంభించేసినట్లు తెలుస్తోంది. ఓ ఫిష్ మార్కెట్ బ్యాగ్రౌండ్ లో సినిమా ఉండబోతుందని, చెపలు పట్టేవాడిగా పక్కా మాస్ క్యారెక్టర్ లో సూర్య కనిపించబోతున్నాడని టాక్.

మరోవైపు ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో యంగ్ డైరక్టర్ విఘ్నేష్ శివన్ తో సూర్య ఓ సినిమా తీస్తుండగా, సెల్వ రాఘవన్ ప్రాజెక్టు రద్దు కావటంతో కొత్త సినిమాలో నటించేందుకు ఓకే చెప్పినట్లు సమాచారం. సూర్య బ్యానర్ 2డీ ఎంటర్ టైన్ మెంట్స్ లోనే సుధా సినిమా తెరకెక్కబోతుంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kollywood  Suriya  Sudha Kongara  

Other Articles