After Saaho Prabhas Under this Director

Prabhas again team up with prabhudeva

Prabhas, Prabhudeva, Prabhas Saaho, Prabhas After Saaho, Prabhas again Prabhudeva Direction, Prabhudeva Using Prabhudeva Movie, Prabhudeva Movie, Prabhas Saaho, Prabhas New Movie, Prabhudeva Prabhas Fame

Prabhudeva to Direct Prabhas after Saaho.

ప్రభాస్ తో కొమియో కాదు ఏకంగా డైరక్షనే...

Posted: 06/30/2017 02:29 PM IST
Prabhas again team up with prabhudeva

బాహుబలి ఇమేజ్ తో తన స్టార్ డమ్ ను ఓ రేంజ్ లో పెంచేసుకున్న ప్రభాస్ దానిని కంటిన్యూ చేయాలంటే తర్వాతి సినిమాలు కూడా అదే రేంజ్ లో ఉండి తీరాల్సిందే. 150 కోట్ల భారీ బడ్జెట్ తో సాహో సుజిత్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పెద్దగా ఎక్స్ పీరియన్స్ లేకపోయినా కథ మీద నమ్మకంతో ప్రభాస్, నిర్మాతలే డేర్ చేసి మరీ అడుగేశారు. మరి ప్రభాస్ తన తర్వాతి చిత్రాన్ని ఎవరి డైరక్షన్ లో చేస్తాడు?

కొంత కాలం క్రితం దాకా జిల్ ఫేం రాధాకృష్ణ పేరు లైనప్ లో వినిపించిన విషయం తెలిసిందే. ఓ ప్రేమ కథగా ఆ సినిమా తెరకె్కుతుందని, పైగా అందులో డార్లింగ్ ఆస్ట్రాలజర్ గా నటించబోతున్నాడని చెప్పుకున్నాం కూడా. కానీ, ఇప్పుడేమో మరో డైరక్టర్ ప్రభాస్ ను డైరక్ట్ చేయబోయేది నేనే నంటూ ముందుకు వచ్చాడు. కొరియో గ్రాఫర్ కమ్ డైరక్టర్ ప్రభుదేవా ప్రభాస్ తో ఓ సినిమా ఉంటుందని ప్రకటించేశాడు.

ప్రస్తుతం బాలీవుడ్ లో కామోషియాలో ప్రభుదేవా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ప్రభాస్ గెస్ట్ రోల్ అంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో స్పందించిన ప్రభుదేవా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించాడు. ‘‘ప్రభాస్ తో నాకు స్నేహం ఎప్పటి నుంచో ఉంది. సినీరంగంలోకి అడుగుపెట్టినప్పటి నుంచే అతను నాకు పరిచయం. సాహో తర్వాత అతన్ని నేనే డైరక్ట్ చేస్తా’’ అంటూ చెప్పుకొచ్చాడు. అయితే అది బాలీవుడ్ డెబ్యూనా లేక మల్లీ లాంగ్వేజ్ మూవీయా అన్నది మాత్రం ప్రభుదేవా క్లారిటీ ఇవ్వలేదు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prabhas  Prabhudeva  Saaho Movie  

Other Articles