Duvvada Jagannadham Audio Launch Highlights

Dj movie audio launch highlights

Allu Arjun, Allu Arjun Duvvada Jagannadham Audio, Duvvada Jagannadham Movie Audio Launch, DJ Audio Launch Highlights, DJ Movie Audio Event, Allu Arjun Spech Dj Audio Launch, Dj Audio, Bunny Family at DJ Audio Launch, Harish Shankar Speech at DJ Audio, Bunny Sneha DJ Audio

Allu Arjun Duvvada Jagannadham Movie Audio Launched. Highlights and Gestures Speeches. Second Trailer also Released. Dil Raju Confident on DJ Success.

దువ్వాడ జగన్నాథమ్ ఆడియో హైలెట్స్

Posted: 06/12/2017 09:33 AM IST
Dj movie audio launch highlights

'పబ్బుల్లో వాయించే డీజే కాదు...పగిలిపోయేలా వాయించేవాడీ డీజే' ఈ ఒక్క లైన్ చాలు తన సినిమా ఎలా ఉంటుందో చెప్పేయొచ్చని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తెలిపాడు. దువ్వాడ జగన్నాథం ఆడియో వేడుక శిల్పకళావేదికలో ఆడియో వేడక ఘనంగా జరిగింది. సినిమాలోని డైలాగులు చెబుతూ ఆడియన్స్ ను అలరిస్తూనే టెక్నిషీయన్స్ అందరికీ పేరు పేరునా థాంక్స్ చెప్పుకొచ్చాడు. ప్రతి సినిమా తన కోసం ఆడాలని అనుకుంటానని, అయితే ఈ సినిమా మాత్రం తొలిసారి దిల్ రాజు కోసం బాగా ఆడాలని కోరుకుంటున్నానని చెప్పాడు.

ఆయన భార్య అనిత సడన్ గా చనిపోవటం, అయినప్పటికీ కమిట్ మెంట్ తో రాజు తమని ముందుకు నడిపించాడని అందుకే ఆయన కోసం సినిమా హిట్ అవ్వాలని కోరాడు. ఆయన బ్యానర్ లో చేసిన సెకండ్ మూవీ 'ఆర్య' సినిమా నుంచి తన కెరీర్ ఇంచుమించు ప్రారంభమైందని, ఇప్పుడు తాను వారి 25వ సినిమాలో నటిస్తున్నానని, ఈ సినిమా ఆయన కోసం తప్పకుండా ఆడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా తమను ఇంతకాలంగా ఆదరిస్తున్న మెగా ఫ్యామిలీ అభిమానులందరికీ ధన్యవాదాలన్నాడు.

 

దర్శకుల గురించి చెప్పాల్సి వస్తే....దర్శకరత్న దాసరి నారాయణ రావుగారి గురించి చెప్పుకోవాలని అన్నాడు. ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు లోటని అన్నాడు. తెలుగు సినిమా బతికున్నంత కాలం ఆయన పేరు చిరస్థాయిగా ఉంటుందని అన్నాడు. ఆయనను చిరకాలం గుండెల్లో పెట్టుకుంటామని చెప్పాడు.


23న తెలుస్తుంది: దిల్ రాజు

14 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఎంతో మందితో పని చేశానని, ఎంతో మంది మంచి మనుషులు పరిచయమయ్యారని దిల్ రాజు చెప్పుకొచ్చాడు. తమ బ్యానర్ లో 25వ సినిమా మంచి సినిమా కావాలని భావించానని అన్నారు. కెరీర్ ఆరంభంలో వచ్చిన 'పరుగు' సినిమాతో హిట్ అందించిన అల్లు అర్జున్ తో ఈ సినిమా చేయడం ఆనందంగా ఉందని చెప్పాడు. ఈ కాంబినేషన్ ఎంతగా ఆకట్టుకుంటుందో 23న సినిమా చూసి బయటకు వచ్చిన మీరే చెబుతారని దిల్ రాజు చెప్పాడు. చివరిగా చెబుతూ, 'సినిమా సూపర్ హిట్' అంటూ కాన్ఫిడెన్ తో ఉన్నాడు. డీజే కొత్త ట్రైలర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu Arjun  Duvvada Jagannadham  Audio Launch  

Other Articles