DJ Audio and Pre Release Date Announced

Audio release date for dj movie

Duvvada Jagannadham, Duvvada Jagannadham Movie, Duvvada Jagannadham Auido Release, Duvvada Jagannadham Pre Release, Bunny Stop Pre Release Event, Tollywood Pre Release Event Culture, DJ Audio date, Bunny DJ New Posters, DJ Movie New Poster, DJ Audio Poster, Audio DJ Movie, DJ Audio Songs, Allu Arjun DJ Audio Date

Allu Arjun Duvvada Jagannadham Audio and Pre Release Date Announced.

బన్నీ ఆ సాంప్రదాయానికి చెక్ పెట్టాడా?

Posted: 06/09/2017 12:49 PM IST
Audio release date for dj movie

టాలీవుడ్ లో సరైనోడుతో ఆడియో పంక్షన్ కి బదులుగా ప్రీ రిలీజ్ వేడుక అంటూ ఓ కొత్త కల్చర్ కి తెరలేపాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. సరైనోడు తో మొదలైన ఆ హడావుడి తర్వాత ధృవ, ఖైదీ నంబర్ 150, కాటమరాయుడు, విన్నర్, మిస్టర్ ఇలా మెగా ఫ్యామిలీ హీరోల చిత్రాలకే కాకుండా ఇంకొందరు యంగ్ స్టర్లకు కూడా అలవాటుగా మారిపోయింది. ముందు పాటలను ఆన్ లైన్ లో రిలీజ్ చేసి, ఆపై ఇలా ఓ ఈవెంట్ ను చేయటం ద్వారా సినిమాకు విపరీతమైన హైప్ పెంచేశారు.

ఇప్పుడు బన్నీ దువ్వాడ జగన్నాథమ్ కు కూడా ఇదే పద్ధతిని ఫాలో అవుతారని అంతా భావించారు. ఫస్ట్ సాంగ్ శరణం భజే తర్వాత అదే కన్ఫర్మ్ అయ్యారు కూడా. కానీ, అలా కాకుండా ఆడియో వేడుకకు ఇప్పుడు రంగం సిద్ధం అయిపోయింది. జూన్ 11న చిత్ర ఆడియోను రిలీజ్ చేయనున్నట్లు నిర్మాత దిల్ రాజు ప్రకటించాడు. అయితే వారం తర్వాత అంటే 18న సరిగ్గా సినిమా రిలీజ్ కు అయిదు రోజుల ముందు ప్రీ రిలీజ్ వేడుకను కూడా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

 

ఇక రెండో సాంగ్ గుడిలో బడిలో.. లో గ్రేస్ ను చూపించిన బన్నీ మరోసారి డాన్సులతో ఇరగదీసినట్లు తెలుస్తోంది. ఆడియో రిలీజ్ పోస్టర్ లో బన్నీ గెటప్, ఫోజు ను బట్టి దేవీ ట్రాక్ కి అదిరిపోయే స్టైలిస్ స్టెప్పులు ఉండబోతున్నాయని చెప్పేశాడు దిల్ రాజు. ఆ మ్యాజిక్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే మాత్రం జూన్ 23న దాకా ఆగాల్సిందే.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu Arjun  DJ Movie  Audio date  Pre Release Event  

Other Articles