Madras HC Postponed Trisha's IT Penalty Case

Madras hc posts it dept plea against trisha

Madras High Court, Actress Trsiha, Trisha IT Case, Trisha IT Cheating, Trisha IT Penalty, Trisha Case, Madras High Court Cheating, Trisha Cheating Case, High Court Actress Trisha

Madras HC posts Income Tax department plea against Actress Trisha. The actress in the early stages of the assessment had not disclosed the amount received from some people as income but only as advance amount.

త్రిషపై ఛీటింగ్ కేసు.. వాయిదా పడిందిగా

Posted: 06/09/2017 09:35 AM IST
Madras hc posts it dept plea against trisha

సౌత్ ఇండియా టాప్ హీరోయిన్ త్రిష పై నమోదైన కేసులో తాత్కాలికంగా ఊరట లభించింది. ఆదాయపు పన్నుల శాఖ వేసిన కేసులో విచారణను మరో వారానికి వాయిదా వేస్తూ తీర్పు ఇచ్చింది. తప్పుడు ఆదాయపు లెక్కలు చూపించటంతో గతంలో ఇన్ కం టాక్స్ శాఖ త్రిషకు జరిమానా విధించగా, ఆమె ఐటీ ట్రైబ్యునల్ ఆశ్రయించి ఆ ఉత్తర్వులను రద్దు చేయించుకుంది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆదాయ పన్నుల శాఖ మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది.

నిజానికి 2010-11వ సంవత్సరంలో తన ఆదాయం రూ.89 లక్షలుగా అడ్వాన్స్ రిటర్న్స్ త్రిష దాఖలు చేసింది. అయితే, సినిమాల్లో నటించే నిమిత్తం తీసుకున్న అడ్వాన్స్ లను ఇందులో కలపలేదు. ఐటీ నిబంధనల ప్రకారం, అడ్వాన్స్ గా తీసుకున్న మొత్తం కూడా ఆదాయ పరిధిలోకి వస్తాయి. ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ మోసం చేసిందంటూ త్రిషకు రూ.1.15 కోట్ల జరిమానాను విధించింది. అయితే అది సబబు కాదంటూ ట్రైబ్యునల్ ను త్రిష ఆశ్రయించడం, ఆమెకు అనుకూలంగా తీర్పు రావటం జరిగిపోయాయి.

దీంతో ఈ తీర్పును సవాల్ చేస్తూ ఐటీ శాఖ మద్రాసు హైకోర్టులో నిన్న(గురువారం) పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇందిరా బెనర్జీ, న్యాయమూర్తి సుందర్ లతో కూడిన ధర్మాసనం ఈ కేసు విచారణను ఈ నెల 13వ తేదీకి వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Trisha  Cheating Case  IT Department  Madras HC  

Other Articles