Top Producer cheated Dasari for 20 Crores

Tollywood producer cheat dasari narayana rao

Dasari Narayana Rao, Dasari Cheated, Dasri Top Producer, Producer Escape Dasari, Top Producer Cheat Dasari, Dasari Financial Settlements, Dasari Borrow Money, Dasari Debts, Dasrai Narayana Rao

Tollywood Top Producer Eluded Calls of Deceased Director Dasari Narayana Rao. Allegedly borrowed an amount of Rs. 20 crores from Dasari and didn’t return the amount.

దాసరిని ఘోరంగా మోసం చేసిన ఆ నిర్మాత ఎవరు?

Posted: 06/06/2017 01:17 PM IST
Tollywood producer cheat dasari narayana rao

టాలీవుడ్ కు పెద్ద దిక్కుగా, ముఖ్యంగా చిన్న మేకర్లకు అండగా నిలుస్తూ వచ్చిన దాసరి నారాయణ రావు నిష్క్రమణతో చాలా మంది గుండెలు బద్ధలయ్యాయి. ముఖ్యంగా తనకు లైఫ్ ఇచ్చి ఈ స్థాయికి చేర్చిన లెజెండరీ డైరక్టర్ చనిపోవటం మోహన్ బాబును ఎంతగా కలిచివేసిందో ఎగ్జాంపుల్ గా చూశాం. అయితే చివరి రోజుల్లో ఆయనతో అంటి ముట్టనల్లు వ్యవహరించిన వాళ్లు కూడా లేకపోలేదు. వారిలో ఆయనతో కొన్ని సినిమాలు తీసిన ఓ నిర్మాత వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఇందుకు కారణం దాసరితో ఆయనకు ఆర్థిక వ్యవహారాలు ఉండటమేనంట. సదరు నిర్మాత దాసరి నుంచి కొంత కాలం క్రితం దాదాపు 20 కోట్లు అప్పుగా తీసుకున్నాడని, అది ఇంతవరకు తీర్చలేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. బతికున్న సమయంలో దాసరి ఈ విషయంపై ఎన్నిసార్లు ఫోన్ చేసిన స్పందించలేదని, చివరకు ఆయన ఆస్పత్రి పాలైన సమయంలో పరామర్శించేందుకు రాలేదని చెబుతున్నారు.

చివరిసారిగా ఆ నిర్మాత 2011 లో ఓ బడా హీరోతో సినిమా తీయగా, అది కాస్త అట్టర్ ఫ్లాఫ్ అయ్యింది. దీంతో ప్రస్తుతం సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ కాలం వెల్లదీస్తున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం దాసరి ఆర్థిక వ్యవహారాలన్నీ మోహన్ బాబు చక్కదిద్దే పనిలో ఉండగా, కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dasari Narayana rao  Tollywood Producer  Eluded Debt  

Other Articles