Sridevi Smart Answer to Media on Jhanvi Debut.

Sridevi fire on media at mom trailer

Sridevi MOM Trailer, Jhanvi Debut Sridevi, Sridevi Fire Media, Ask MOM not Daughter, Sridevi Media, Sridevi, Sridevi Irritate Media Questions, Jhanvi Kapoor Bollywood Debut

Asked About Jhanvi's Bollywood Debut at MOM Trailer Launch, Sridevi gives a Smart Reply. "Today we will talk about Jhanvi's mom. We will talk about Jhanvi later," said Sridevi.

కూతురి మీద క్వశ్చన్స్.. శ్రీదేవి ఫైర్

Posted: 06/06/2017 09:16 AM IST
Sridevi fire on media at mom trailer

ఒకప్పటి అందాల తార శ్రీదేవి మళ్లీ సినిమాలతో బిజీ అయిపోతున్నప్పటికీ కూతురి తలనొప్పి మాత్రం తప్పటం లేదు. జాహ్నవి అఫైర్లు, డెబ్యూ గురించి ఎక్కడికెళ్లినా ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి. అయితే తానేమో ఉమెన్ సెంట్రిక్ కాన్సెప్ట్ లతో మళ్లీ దూసుకుపోవాలని యత్నిస్తుంటే.. కూతురి మీదే మీడియా ఫోకస్ పెట్టడం సహజంగానే ఆమెకు మంటపుట్టిస్తోంది.

ఇక మామ్ ట్రైలర్ వేడుకలో అయితే ఏకంగా తన అసహనాన్ని ప్రదర్శించింది కూడా. తన కూతురు జాహ్నవి ఫొటోలు తీయొద్దని, అందుకు సంబంధించిన ప్రశ్నలు వేయొద్దని మీడియాపై ప్రముఖ సినీ నటి శ్రీదేవి ఆగ్రహం వ్యక్తం చేసింది. కార్యక్రమానికి తన ఇద్దరు కూతుళ్లు జాహ్నవి, ఖుషితో కలిసి శ్రీదేవి హాజరైంది. కవరేజ్ నిమిత్తం అక్కడికి వచ్చిన మీడియా, శ్రీదేవి గురించి కాకుండా, జాహ్నవి నటించబోయే సినిమాల గురించి ప్రశ్నించింది. దీంతో, శ్రీదేవికి కోపమొచ్చింది.

ముందు మామ్(తన గురించి) మాత్రమే అడగాలని.. ఇది జాహ్నవి కోసం ఏర్పాటు చేసింది కాదని ఘాటుగా చెప్పింది. జాహ్నవి నటించబోయే సినిమాల గురించి త్వరలోనే చెప్తానంటూ కాస్త కఠినంగా ఆన్సర్ ఇచ్చినట్లు నేషనల్ మీడియా కథనాలు వెలువరించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sridevi  Jhanvi Kapoor  Bollywood Debut  Media Fire  

Other Articles