South Multi-Lingual Multi-Starrer Not Shelved

Gautam menon multi starrer not shelved

Gautham Vasudev Menon, South Biggest Multi Starrer, Gautham Menon Big Multi Starrer, Gautam Menon New Movie, Naga Chaitanya Puneet Rajkumar Pruthvi Raj and Simbu, Puneet Rajkumar Pruthvi Raj, Puneet Rajkumar Gautam Menon Movie, Anushka Tamanna Gautam Menon

Gautham Vasudev Menon’s multi-lingual multi-starrer project and has clarified that it has not been shelved.

సౌత్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ కి కోలీవుడ్ ట్రబుల్

Posted: 06/01/2017 02:32 PM IST
Gautam menon multi starrer not shelved

బాలీవుడ్ కు గట్టి పోటినిచ్చే స్థాయికి చేరుకున్న సౌత్ ఇండస్ట్రీ ఇప్పటి నుంచి ఛాన్స్ దొరికినప్పుడల్లా భారీ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమైపోతుంది. ఇందులో భాగంగా సౌత్ లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కబోతుంది. లవ్ అండ్ యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ గౌతమ్ మీనన్ దీనిని రూపొందించబోతున్నాడు.

నాలుగు భాషల్లో .. నలుగురు హీరోలతో .. నలుగురు హీరోయిన్లతో ఓ అడ్వెంచరస్ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. ఒక పెళ్లి వేడుకకి వచ్చిన ఆ నలుగురు అక్కడి నుంచి ఓ అడ్వెంచర్ ట్రిప్ కి వెళతారు. అక్కడ వాళ్లకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? అప్పుడు వాళ్లు ఏంచేస్తారు? అనే ఆసక్తికరమైన కథా కథనాలతో ఈ సినిమా కొనసాగనుంది.

మళయాళం నుంచి పృథ్వీరాజ్, కన్నడ నుంచి పునీత్ రాజ్ కుమార్ కథకి ఓకే చెప్పగా, టాలీవుడ్ నుంచి సాయి దరమ్ తేజ్ అనుకున్నప్పటికీ తర్వాత నాగ చైతన్య అల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడంట. ఇక కోలీవుడ్ నుంచి శింబు కోసం గౌతమ్ ట్రై చేస్తున్నాడు. హీరోయిన్లు అనుష్క, తమన్నాలు సిగ్నల్ ఇవ్వగా, మరో ఇద్దరు హీరోయిన్లుగా మల్లూ బ్యూటీస్ నివేదా థామస్ .. మంజిమా మోహన్ వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఆపై రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యే ఛాన్స్ ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gautham Menon  South Biggest Multi Starrer  Naga Chaitanya  

Other Articles