Kamal Haasan More Socially Responsible than Aamir Khan

Kamal dig at aamir over satyamev

Kamal Haasan, Kamal Aamir Khan, Kama Dig Aamir, Kamal Big Boss Trailer Launch, Kamal Haasan Comments National Media, Satyamev Jayate Kamal Haasan, Satyamev Jayate Kamal Aamir

Kamal Haasan takes a dig at Aamir Khan, says he's more socially responsible. Satires on Satyamev Jayate at Tamil Big Boss Trailer Launch.

అమీర్ పై కమల్ సంచలన వ్యాఖ్యలు

Posted: 05/27/2017 05:22 PM IST
Kamal dig at aamir over satyamev

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కు వివాదలేం కొత్త కాదు. కుండబద్దలు కొట్టినట్లు ఓపెన్ గా మాట్లాడటమే కాదు.. ఒకానోక టైంలో తీవ్ర వివాదాలను కూడా ఆయన రాజేస్తుంటాడు. ఈ మధ్య బాహుబలిని తక్కువ చేస్తూ చేసిన వ్యాఖ్యలు తేరుకునే లోపే రజనీకాంత్ కు కెమెరా పిచ్చి ఉందంటూ చేసిన వ్యాఖ్యల దాకా అన్ని రచ్చ చేసి పడేశాయి. కానీ, తాజాగా చేసిన కామెంట్లతో బాలీవుడ్ కు ఆ రేంజ్ చేరిపోయింది.

బిగ్ బాస్ తమిళ్ వర్షన్ కు కమల్ హాసన్ త్వరలో హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడు. ఈ నేపథ్యంలో మాట్లాడితే దేశ భక్తి గురించి మాట్లాడే మీరు సామాజిక కార్యక్రమాలు కాకుండా ఇలా ఓ సినిమాటిక్ ప్రోగ్రాంలను ఎంచుకోవటం ఏంటని ప్రశ్నించిన మీడియాకు దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చాడు. 'సత్యమేవ జయతే' లాంటి కార్యక్రమం చేసి నా సామాజిక బాధ్యతను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఆ కార్యక్రమాన్ని హోస్ట్ చేసిన వ్యక్తి కంటే ఎక్కువగానే నాకు సామాజిక బాధ్యత ఉంది' అంటూ ఆమిర్ ఖాన్ కు కమల్ కౌంటర్ వేశాడు.

దీంతో నేషనల్ మీడియా దీనిని చాలా సీరియస్ ఇష్యూగా పరిగణిస్తోంది. అసలే బాహుబలి సక్సెస్ తర్వాత సౌత్ స్టామినా పెరిగిపోవటంతో ఎక్కడా దొరకుతారా? అన్న చూస్తున్న బాలీవుడ్ మీడియాకు కమల్ వ్యాఖ్యలు మాంచి సపోర్ట్ గా దొరికాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kamal Haasan  Big Boss Show  Aamir Khan  Satyamev Jayate  

Other Articles