Happy Days Fame Rahul Confess His Mistakes

Happy days rahul on his own voice

Happy Days Fame Rahul, Rahul Haridas, Rahul Venkatapuram, Venkatapuram Hero Rahul Haridas, Actor Rahul Tollywood, Venkatapuram Hero Interview, Actor Rahul Interview, Venkatapuram Movie Hero, Actor Rahul Voice, Happy Days Actor Confess Mistake

Happy Days Fame Rahul Venkatapuram Movie Interview. Confess his mistakes in Tollywood. Rahul did the convincing thing by getting his voice dubbed by another Professional.

పెద్ద పెద్ద హీరోలకే ఫ్లాపులు తప్పలేదు

Posted: 05/13/2017 11:58 AM IST
Happy days rahul on his own voice

హ్యాపీడేస్ అనే ఒక్క సినిమా ఎంత మందికి లైఫ్ ఇచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరుణ్ సందేశ్, తమన్నా, నిఖిల్ ఇలా కెరీర్ లో ఎదిగేందుకు ఎంతో ఉపయోగపడింది. అయితే వారిలో నటించిన వాళ్లో నిఖిల్, తమన్నా తప్ప మిగతా వాళ్లు తర్వాత పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. వీరిలో టైసన్ రోల్ లో అమాయకత్వం నటించిన రాహుల్ పరిస్థితి కూడా ఇంతే.ఆ మధ్య సిక్స్ ప్యాక్ బాడీ పెంచేసి రెండు మూడు సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా వర్కవుట్ కాలేకపోయింది.

అయితే రీసెంట్ గా నటించిన వెంకటాపురం మాత్రం అతనికి కాస్త ఉపశమనం అందించింది. సినిమాలో రాహుల్ నటన ఇంప్రూవ్ అయ్యిందని క్రిటిక్స్ రివ్యూల్లో ప్రశంసలు కురిపించారు. అయితే ఇన్నాళ్లూ తాను చేసిన  తప్పులేంటో గుర్తించానని, ఇకపై అలాంటివి చేయబోనని అంటున్నాడు. పెద్ద పెద్ద స్టార్ హీరోలే కెరీర్ మొదట్లో ఇలా ఇబ్బందులు పడ్డ వారే. రాను రాను రాటు దేలతానన్న నమ్మకం నాకు ఉంది అని చెబుతున్నాడు రాహుల్.

కథల ఎంపికలో కూడా జాగ్రత్తలు తీసుకుంటానని, తన వాయిస్ సాఫ్ట్ గా ఉందంటూ విమర్శలు రావటంతోనే డబ్బింగ్ ఆర్టిస్ట్ తో మ్యానేజ్ చేయించగా, దానికి మంచి రెస్పాన్స్ వస్తుందన్నాడు. ఓవరాల్ గా ఓకే టాక్ తో యావరేజ్ మార్కులు వేయించుకున్న వెంకటాపురం.. బాహుబలి-2 హవా ముందు కొనసాగటం కష్టమే అయినా, కాస్తైనా క్రౌడ్ అటువైపుగా లాగటంలో సక్సెస్ అవుతుందో లేదో చూడాలి మరి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actor Rahul  Venkatapuram Movie  

Other Articles