Rana Not Feeling Well with Baahubali 2 Scene

Rana feeling not well with baahubali 2 scene

Baahubali The Conclusion, Rana Statue Beheaded Scene, Rana Baahubali 2 Scenes, Baahubali 2 Scene Rana, Rana Not Ok Baahubali 2, Baahubali 2 ACtor Rana, Baahubali Rana, Rana Scene, Rana Baahubali 2 Scene, Rana Statue Baahubali, Rana Statue Head

Baahubali Actor Rana isn't happy with His Statue Head Beheaded Scene

భల్లాలుడి భార్యపై రానా క్లారిటీ

Posted: 05/10/2017 02:48 PM IST
Rana feeling not well with baahubali 2 scene

భల్లాల దేవుడిగా మాహిష్మతి క్రూర రాజుగా రానా చూపించిన యాక్టింగ్ కమ్ బాడీ లాంగ్వేజ్ కు దేశం మొత్తం నీరాజనం పట్టింది. నటనా కుటుంబం నుంచి హీరోగా ఎదుగుతున్న క్రమంలో ఓ ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో విలన్ గా నటించే అవకాశం రావటం, దానిని సద్వినియోగం చేసుకుని మంచి పేరు తెచ్చేసుకున్నాడు.

ఇదిలా ఉంటే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్నదాని కంటే భద్ర తల్లి అదేనండీ భల్లాళదేవుడి వైఫ్ ఎవరన్నది రిలీజ్ అయినప్పటి నుంచి ట్రోల్ అవుతున్న ప్రశ్న. దీనిపై చిత్ర యూనిట్ లో ఎవరూ క్లారిటీ ఇవ్వకపోయే సరికి స్వయంగా రానానే స్పందించాడు. భల్లాలదేవుడికి భార్య లేదు.. సరోగసీ ద్వారా బిడ్డను పొందాడంటూ సెటైరిక్ గా సమాధానం ఇచ్చేశాడు.

ఇక సినిమాలో తన శ్రమ అంతా వృథా కాకపోయినప్పటికీ ఓ సీన్ మాత్రం తనను తీవ్రంగా భాధించిందని చెబుతున్నాడు. భల్లాలదేవుడి భారీ విగ్రహం తల కూల్చివేసే సన్నివేశం తనని ఎంతో బాధించిందని చెప్పాడు. ఐదేళ్ల నుంచి ఆ విగ్రహాంలో నన్ను నేను చూసుకుంటున్నా. హఠాత్తుగా దాని తల తీసేసరికి ఎందుకో భరించలేకపోతున్నా. ఆ ముక్కలైన విగ్రహాం ఇంకా రామోజీ ఫిల్మ్ సిటీలో భద్రంగా ఉందంటూ చెప్పాడు రానా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali 2  Rana  Statue Beheaded SCene  

Other Articles