Chiru Uyyalawada's Story Trouble Continues

Chiru uyyalawada story main problem

Uyyalawada Narasimha Reddy, Chiru Uyyalawada Story, Uyyalawada Movie Story, Uyyalawada Veera Pandya Katta Bomman, Uyyalawada Regular Shooting, Uyyalawada Katta Bommanan

Chiranjeevi Uyyalawada Narasimha Reddy worried about is the similarity of this story with yet another Indian rebellion, who's considered as a great leader by Tamilians Veera Pandya Katta Bomman.

ఉయ్యలవాడకు కథే అసలు సమస్య

Posted: 05/05/2017 04:56 PM IST
Chiru uyyalawada story main problem

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం పోరాట యోధుడు ఉయ్యలవాడ నరసింహరెడ్డి బయోపిక్ కోసం రంగం సిద్ధమైపోయింది. ప్రస్తుతం బాడీ ఫిట్ నెస్, మేకోవర్ పనిలో చిరు బిజీగా ఉన్నాడు. అంతా కుదిరితే జూన్ లేటయితే ఆగష్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే ఛాన్స్ ఉంది. స్క్రిప్ట్ పక్కాగా ఉండేలా దర్శకుడు సురేందర్ రెడ్డి కథను సిద్ధం చేయిస్తున్నాడు. అయితే ఇంత గ్యాప్ కు కారణం ఏంటోనని విశ్లేషించేవారికి ఇప్పుడు సమాధానం దొరికింది.

ఉయ్యలవాడ నరసింహారెడ్డి తరహాలో మరో యోధుడి కథ ఇప్పుడు కొత్త సమస్యను క్రియేట్ చేసింది. సీమ ప్రాంతానికి చెందిన ఉయ్యలవాడ బ్రిటీష్ వాళ్లకు వ్యతిరేకంగా ఉద్యమం నడిపిన విషయం తెలిసిందే. సొంత వాళ్లే కుట్ర పన్ని ఆయన్ని పట్టించగా, ఆంగ్లేయులు ఉరి తీసి ఆయన్ని చంపేశారు. ఆ తర్వాత మరెవరూ తిరుగుబాటు చేయకుండా వణుకుపుట్టేలా ముప్పై ఏళ్లపాటు ఆయన తలను కోట గుమ్మానికి వేలాడదీశారు.

సేమ్ ఇదే తరహాలో 1790 ప్రాంతంలో తమిళనాడులో బ్రిటీష్ వాళ్లకు వ్యతిరేకంగా ఉద్యమం నడిపాడు నాయక రాజు వీర పాండ్య కట్టబొమ్మన. ఈయన కథ కూడా దాదాపు ఇదే తరహాలో ఉంది. ఆంగ్లేయులపై వరుస దాడులతో వణికించిన ఆయన్ని కూడా సొంత వాళ్లే మోసం చేసి అప్పగించగా, ఆపై ఉరి శిక్ష అమలు చేశారు. ఇక ఈ రెండు కథలు దాదాపు ఒకే రీతిలో ఉండటంతో వేరియేషన్ కోసం ఇంకా ఏవైనా కొత్త అంశాలు దొరుకుతాయేమోనన్న కోణంలో పరుచూరి నేతృత్వంలోని రచయితల బృందం రీసెర్చ్ చేస్తోందంట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiranjeevi  Uyyalawada Story  Trouble  

Other Articles