Actor Vinu Chakravarthy died due to age-related illness

Veteran actor vinu chakravarthy passes away

Vinu Chakravarthy, Vinu Chakravarthy Silk Smitha, Silk Smitha God Father, Silk Smitha Guru Died, Silk Smitha Mentor Vinu Chakravarthy, Vinu Chakravarthy News, Vinu Chakravarthy Rajinikanth, Actor Writer Vinu Chakravarthy

Veteran Tamil actor, script writer Vinu Chakravarthy who introduced Silk Smitha to the industry, passes away at the age of 71.

సీనియర్ నటుడు విను చక్రవర్తి మృతి

Posted: 04/28/2017 06:36 PM IST
Veteran actor vinu chakravarthy passes away

వెయ్యికి పైగా సినిమాల్లో నటించిన సౌత్ ఇండస్ట్రీ సీనియర్ నటుడు విను చక్రవర్తి ఇక లేరు. 74 ఏళ్ల ఈ రచయిత కమ్ సీనియర్ నటుడు అనారోగ్య కారణంగా మూడేళ్ల నుంచి చికిత్స తీసుకుంటూ గురువారం రాత్రి మృతి చెందాడు.

విను చక్రవర్తి పేరుకు కన్నడ వ్యక్తే అయినప్పటికీ తమిళ సినిమాల్లోనే ఆయన ఎక్కువ శాతం నటించారు. కథా రచయితగా తన కెరీర్ ను ప్రారంభించిన ఆయన, ప్రముఖ శాండల్ వుడ్ డైరక్టర్ పుట్టన కనగల్ వద్ద రైటర్ గా పని చేశాడు. 1977లో ‘పరసంగడ గెండెటిమ్మ’అనే కన్నడ చిత్రంలో తొలిసారిగా నటించారు. సినిమాలోకి రాక ముందు పోలీస్ శాఖలో ఆయన విధులు నిర్వహించారు. విలనిజంలో వైవిధ్యతను తమిళ ఇండస్ట్రీకి పరిచయం చేసిందే ఆయన.

అలనాటి శృంగార తార సిల్క్ స్మితను అసలు సినీ పరిశ్రమకు పరిచయం చేసిందే ఈయన. విను ను ఆమె పలు సందర్భాలలో గాడ్ ఫాదర్ గా వ్యవహరించేది కూడా. తెలుగు, తమిళం, మలయాళ చిత్రాల్లో నటించారు. ప్రముఖ నటులు జెమినీ గణేశన్, రజనీకాంత, కమల హాసన్ నటించిన చిత్రాల్లో ఆయన యాక్ట్ చేశారు. రెండేళ్ల క్రితం వచ్చిన తమిళ చిత్రం ‘వాయ మూడి పెసవం’లో ఆయన చివరి చిత్రం. ఆయన మృతికి కోలీవుడ్ సెలబ్రీలంతా సోషల్ మీడియాలో సంతాపం తెలియజేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kollywood  Senior Actor  Vinu Chakravarthy  Death  Silk Smitha  

Other Articles