Big release for baahubali 2 in bollywood | బాహుబలి-2... మరీ ఆరు రెట్ల కలెక్షన్లా??

Baahubali 2 big release in bollywood

Baahubali 2, Baahubali 2 Bollywood Release, Baahubali 2 Hindi Firstday Collections, Baahubali 2 Bollywood Collections, Baahubali 2 Hindi Business, Baahubali 2 Bollywood Expectations, Baahubali 2 Bollywood Predictions, Baahubali 2 Indian Theaters, Baahubali 2 Overseas Theaters

Baahubali 2 Expected grand Opening In Bollywood too.It might be doing close to or more than 30 Cr. Yes, Baahubali 2 is that huge.

బాహుబలి-2 .. బాలీవుడ్ బిగ్ రిలీజ్

Posted: 04/24/2017 04:34 PM IST
Baahubali 2 big release in bollywood

ఈ యేడాది మోస్ట్ అవెయిటింగ్ మూవీ బాహుబలి 2 మరో నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున్న రిలీజ్ అయ్యేందుకు సన్నాహాలు జరుగుతున్న ఈ చిత్రం గురించి ఇంటర్నేషనల్ మీడియాలు ప్రత్యేకంగా ఆర్టికల్స్ కూడా రాసేస్తున్నాయి. ఒక్క ఇండియాలోనే 5000 థియేటర్లు అంటే చిన్న విషయం కాదు కదా. అందుకే బాలీవుడ్ తో సహా అన్ని భాషల ప్రేక్షకులు, వీఐపీలు కూడా ఎంతో ఎగ్జయిటింగ్ గా ఎదురు చూస్తున్నారు.

ఇదిలా ఉంటే బాలీవుడ్ మీడియాకు ఈ సినిమాపై ప్రత్యేక దృష్టిసారించింది. వెయ్యి కోట్ల కలెక్షన్ల సంగతి పక్కన పెడితే ఫస్ట్ డే రికార్డులు ఏ రేంజ్ లో ఉంటాయోనన్న డిస్కషన్లు ప్రారంభించేసింది. నోట్ల రద్దు తర్వాత బాలీవుడ్ లో ఫస్ట్ డే వండర్స్ చేసిన సినిమాలు రాలేదు. అంతెందుకు ఈ యేడాది వచ్చిన రయిస్, కాబిల్ కూడా మొదటి రోజు పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోయాయి. చివరగా.. అమీర్ దంగల్ 29.5 కోట్లే రికార్డుగా ఉంది.

కానీ, బాహుబలి ది కంక్లూజన్ క్రేజ్ ను పరిగణనలోకి తీసుకుని ఈ చిత్రం ఖచ్ఛితంగా తొలి రోజు ముప్పై కోట్ల పైగానే రాబట్టడం ఖాయమనే ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొదటి పార్ట్ తొలి రోజు వసూలు 5 కోట్లకు కాస్త అటు ఇటుగా ఉండి, ఫుల్ రన్ లో సల్మాన్ భజిరంగీ భాయ్ జాన్ ను తట్టుకుని మరీ వంద కోట్లు సాధించటం మాములు విషయం కాదు. ఇక ఇప్పుడు ఆ అంచనా ఆరు రెట్లకు పెరిగిపోయాయంటే బాహుబలి మేనియా ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali 2  Bollywood Business  Big release  

Other Articles