Censorship for TV Shows too | వల్గర్ షోలను కంట్రోల్ చేయడానికే ఆ ఒక్కటే మార్గం.

Vulgar tv shows may face censor restrictions

Vulgar TV Shows, TV shows Censor, Telugu TV shows Censor, Censorship for TV Shows, Telugu TV Shows, Ministry of Information Small Screen, Television Shows Censor, TV Shows Double Meaning Dialogues

Vulgar TV Shows may Face Censor Restrictions soon. Ministry of Information and Broadcasting has apparently realized the fact that television shows have no such censorship to filter out the inappropriate content that reaches all the classes of the people from kids to the elder. Scenes or events like rape, extramarital affair presentations, illegal relationships, murders in different methods, etc., reach the audience within one tap of the remote.

సెన్సార్ నిబంధనలు.. బుల్లితెర పరిస్థితి ఏంటి?

Posted: 04/24/2017 02:39 PM IST
Vulgar tv shows may face censor restrictions

బిగ్ స్క్రీన్ పై కేవలం రెండున్నర గంటలతో సరిపెట్టే సినిమాల విషయంలో సెన్సార్ బోర్డు తీసుకునే శ్రద్ధ బుల్లి తెర విషయంలో ఎందుకు తీసుకోదనే ఓ ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. ఫ్యామిలీస్ కు మాత్రమే అన్న చందాన బిల్డప్ లు ఇచ్చి, రాత్రి 12 గంటల తర్వాత అన్న నిబంధనలను తుంగలో తొక్కేస్తూ టీఆర్పీల కోసం ఎగబడిపోతున్నాయి. అలాంటప్పుడు వాటిని సెన్సార్ చేయాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

చిట్టి పొట్టి బట్టలు, క్లీవేజ్ షోలు, పైగా నోరు తెరిస్తే డబుల్ మీనింగ్ డైలాగులు.. ఇవి ఇప్పుడు టీవీ ఆన్ చేస్తే కనిపించే పరిస్థితి. ముఖ్యంగా క్రైం స్టోరీలంటూ యదార్థ ఘటనల ఆధారంగా అని కథలు అల్లే కొన్ని ఛానెళ్లు హత్యలు, అత్యాచారాలు, ఇల్లీగల్ అఫైర్ లు ఇలా... అన్నింటిని తెరపై డిటైల్డ్ గా చూపించేస్తున్నాయి. ఎక్కువ మంది చూస్తారన్న సెన్స్ లేకుండా ఛానెళ్లు చేసే ఈ వ్యవహారాలపై ఫిర్యాదులు అందినప్పటికీ నియంత్రణ మండలి కూడా ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం చర్చనీయాంశంగా మారింది.

అయితే ఈ అంశంపై సీబీఎఫ్ సీ చీఫ్ పహ్లజ్ నిహ్లానీ ఎట్టకేలకు స్పందించాడు. సినిమాల కంటే టీవీ ఫ్రోగ్రాంలే ఎక్కువ ప్రభావం చూపుతాయన్న వాదనతో అంగీకరించిన ఆయన, ఈ మధ్య వాటిల్లో మితిమీరి ఎక్కువగా చూపించేస్తున్నారని, వాటిని నియంత్రించేందుకు త్వరలో చర్యలు చేపట్టబోతున్నట్లు వెల్లడించాడు. అయితే వాటికి సెన్సార్ చేయాలన్న అంశంపై మాత్రం ఆయన కామెంట్ చేసేందుకు నిరాకరించాడు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vulgar TV Shows  Ministry of Information  Censorship  

Other Articles