బుల్లితెర మెగాస్టార్ డైరక్షన్ లో ఆది.. ఆ జోనర్ తో హిట్ కొడతాడా? | TV Prabhakar to Direct Young Hero Aadi.

Aadi try his luck with horror movie

TV Prabhakar, Prabhakar Direct, Serial Prabhakar, TV Actor Direct Aadi, Aadi Prabhakar Movie, Aadi Horror Movie, Aadi Horror Zoner Movie, TV Megastar Direct Aadi, Sai Kumar Son Aaadi Horror

TV Actor and Anchor Prabhakar to direct Aadi Sai Kumar a Horror Movie.

హర్రర్ జోనర్ తో ఆది సినిమా

Posted: 04/18/2017 04:50 PM IST
Aadi try his luck with horror movie

పక్కింటి కుర్రాడి గా కనిపించి మొదట్లో వరుస హిట్లు కొడుతూ వచ్చాడు సీనియర్ నటుడు సాయి కుమార్ తనయుడు ఆది. అయితే చివరగా అప్పుడెప్పుడో లవ్లీ తో ఫర్వాలేదనిపించిన ఈ యంగ్ హీరోకి ఈ మధ్య చేసిన చిత్రాలు ఆ స్థాయి హిట్ కూడా అందుకోలేకపోయాడు. సేమ్ టైంలో కెరీర్ ప్రారంభించిన తోటి హీరోలు వరుస సక్సెస్ లతో దూసుకుపోతుంటే మూస టైపు సినిమాలతో కెరీర్ ను మసకబారేలా చేసుకుంటున్నాడన్న విమర్శలు వినిపించాయి.

దీంతో ప్రయోగాలకు సిద్ధమైపోతున్నాడు ఆది . బుల్లి తెర మెగాస్టార్ గా పాపులర్ అయిన యాంకర్ ప్రభాకర్ త్వరలో మెగా ఫోన్ పట్టనున్నాడు. ఆది హీరోగా ఓ హర్రర్ స్టోరీని తెరకెక్కించేందుకు సిద్ధమైపోతున్నాడు. హీరోయిన్ల కోసం అడిషన్స్ చేసిన చివరకు మరాఠీ భామ వైభవి శాండిల్య ను ఎంపిక చేశారు. క్లాసికల్ డాన్సర్ అయిన వైభవి ఇంతకు ముందు తమిళ్ కమెడియన్ సంతానంతో ఓ రెండు చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది.

వీ4 మూవీస్ బ్యానర్ తోపాటు యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్-2 మరియు గ్రీన్ స్డూడియో లాంటి ప్రతిష్టాత్మక బ్యానర్లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించటం విశేసం. హర్రర్ జోనర్ చిత్రాలకు ఇప్పుడు మంచి క్రేజ్ ఉండటంతో సినిమా ఖచ్ఛితంగా హిట్ అయి తీరుతుందని ఆది ఆశలు పెట్టుకున్నాడు. త్వరలో సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Serial Actor Prabhakar  Aadi Sai Kumar  Horror Movie  

Other Articles