మహేష్, బన్నీకారణంగానే కెరీర్ సర్వ నాశనం | Mahesh And Allu Arjun Made Disha Costliest Heroine.

Why mahesh and allu arjun reject disha patani

Disha Patani, Disha Patani Tollywood, Disha Patani Tollywood Star Heroes, Disha Patani Allu Arjun, Disha Patani Mahesh Babu, Mahesh Babu Allu Arjun, Bunny Disha Patani, Disha Patani Remuneration

Disha Patani rejected for Mahesh Babu and Allu Arjun movie for Remuneration reason.

బన్నీ, మహేష్ దిశను ఎందుకు రిజక్ట్ చేశారంటే...

Posted: 04/18/2017 12:36 PM IST
Why mahesh and allu arjun reject disha patani

డైరక్ట్ గా పెద్ద పెద్ద స్టార్ల సరసన సినిమాలు చేసి టాప్ హీరోయిన్ గా మారిపోవటం ఒక రకం అయితే, చిన్న చిన్న హిట్లతో మెల్లి మెల్లిగా క్రేజ్ పెంచేసుకుని ఆ రేంజ్ కి చేరుకోవటం మరో ఎత్తు. సమంత, రకుల్ ఈ రెండు రకాలకు బెస్ట్ ఎగ్జాంపుల్స్ గా చెప్పుకోవచ్చు. అయితే కెరీర్ లో ఎలాంటి ఎదుగుదల లేకపోయినా జస్ట్ మోడలింగ్ తో పాపులర్ అయిన దిశా పఠానీ అందివచ్చిన బంఫరాఫర్ లను చేజార్చుకోవటం ఇప్పుడు డిస్కషన్ కి దారితీసింది.

లోఫర్ ద్వారా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ భామకు క్రేజీ ప్రాజెక్టులలో చేయటం మూలంగా గుర్తింపు తొందరగానే వచ్చేసింది. కానీ, చేతిలో సినిమాలే లేకుండా ఖాళీగా కాలం వెల్లదీస్తోంది. ఇంతలో యూత్ లో మంచి పేరు సంపాదించేసుకున్న దిశను తెలుగు లో ఓ రెండు భారీ ప్రాజెక్టు కోసం సంప్రదించిన విషయం లేట్ గా వెలుగు చూసింది. అందులో ఒకటి మహేష్ కొరటాల భరత్ అను నేను కాగా, బన్నీ-వక్కంతం వంశీల నా పేరు సూర్య. ఈ రెండింటి కోసం పూరీ జగన్నాథ్ కు సంబంధించిన మోడల్ ఏజెన్సీ ద్వారా దిశను సంప్రదించారంట మేకర్లు.

అయితే ఒకేసారి స్టార్ హీరోల సరసన అవకాశం, అది కూడ వాళ్లే వెతుక్కుంటూ రావటంతో కక్తుర్తిపడి కళ్లు చెదిరే రెమ్యునరేషన్ ను డిమాండ్ చేసిందంట. కోటి రూపాయలతోపాటు, అదనంగా తన ఖర్చులు, ఫైవ్ స్టార్ హోటల్ సౌకర్యాలను డిమాండ్ చేసిందంట. దీంతో దిమ్మ తిరిగిన నిర్మాతలు వెనకడుగు వేసి మహేష్ సినిమా కోసం కైరా అద్వానీని, బన్నీ కోసం కన్నడ బ్యూటీ రష్మికను ఓకే చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఈ విషయం తెలిసిన మిగతా మేకర్లు కూడా ఇప్పుడు దిశ వైపు చూసేందుకు జడుసుకుంటున్నారని చెప్పుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : DIsha Patani  Tollywood Movies  Mahesh Babu  Allu Arjun  

Other Articles

Today on Telugu Wishesh