బాహుబలి-2... సునామీ ముందు సైలెన్స్ | Quiet Week Before Baahubali 2 Release.

Baahubali 2 before release situation

Baahubali 2, Baahubali 2 Release, Baahubali 2 Pre Release, Baahubali The Conclusion, Tollywood Ticket Counter, Baahubali 2 Release Date, Baahubali 2 Highlights, Baahubali The Conclusion Predictions

Baahubali the Conclusion release date nearly Quietness in Tollywood.

బాహుబలి-2 రిలీజ్ కు ముందు ఏంటంటే...

Posted: 04/17/2017 03:26 PM IST
Baahubali 2 before release situation

బాహుబలి ది కంక్లూజన్ రిలీజ్ కు మరో 11 రోజులే సమయం ఉంది. సెన్సార్ వ్యవహారం ఇంకా కాకపోవటంతో ఆ పనులను వేగవంతం చేసే పనిలో పడ్డారు నిర్మాతలు. ఇక టాలీవుడ్ తో సహా బాలీవుడ్ కూడా ఏప్రిల్ 28 కోసం ఆసక్తి గా ఎదురుచూస్తోంది. ఇక ఇప్పట్లో సినిమాలేవీ లేకపోవటంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపైనే కళ్లన్నీ ఉన్నాయి.

ఇప్పుడున్న రిలీజ్ అయిన చిత్రాల్లో శివలింగ తప్ప మిగతావేవీ పెద్దగా ఆడట్లేదు. వచ్చే వారం అసలు ఒక్కటంటే ఒక్కటి కూడా రిలీజ్ లేదు. ఈ లెక్కన్న తుఫాన్ ముందు ప్రశాంతత లాగా బాక్సాఫీస్ కౌంటర్ సైలెంట్ గా ఉండబోతుందన్న మాట. ఇది మాత్రమే కాదు టికెట్ల ధర పెంపు వ్వవహారం ఇంకా ఓ కొలిక్కి రాలేదు.

పైగా హైకోర్టు నుంచి ధర పెంపు గురించి విజ్నప్తులు చేయొద్దని నిర్మాతల మండలికి ఆదేశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరపున ఓ కమిటీ ఈ అంశంలో చర్చలు జరుపుతోంది. ఈ అంశాలన్నీ పక్కన పెట్టి ఎప్పుడెప్పుడు అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేస్తారా? అని సగటు ప్రేక్షకుడు ఆసక్తితో ఎదురు చూస్తున్నాడు. ఎప్పటికప్పుడు అప్ డేట్లను అందించేందుకు మేము సిద్ధంగానే ఉన్నాం కూడా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali The Conclusion  Tollywood  

Other Articles