వర్మ వర్సెస్ నాగబాబు వార్ ఎలా ముగిసిందంటే... | RGV Naga Babu war end.

Rgv apology to naga babu

Ram Gopal Varma, RGV Naga Babu, Naga Babu and Varun Tej, Ram Gopal Varma Varun Tej, RGV Varun Tej, RGV Sorry Naga Babu, RGV Sorry Tweets, RGV Vodka Off, Ram Gopal Varma Apology Mega Family, RGV Mega Family War End

Ram Gopal Varma Apology tweets to Naga Babu and Varun Tej.

నాగబాబుకు సారీ చెప్పేసిన వర్మ

Posted: 04/14/2017 11:12 AM IST
Rgv apology to naga babu

ఖైదీ నంబర్ 150 రిలీజ్ సమయంలో చిరును టార్గెట్ చేస్తూ రాంగోపాల్ వర్మ చేసిన కామెంట్లు ఎంతటి దుమారం రేపాయో చూశాం. ప్రీ రిలీజ్ ఆడియో వేడుకలో నాగబాబు స్టేజీ మీద చెలరేగిపోయి అక్కుపక్షి అంటూ వర్మను ఓ రేంజ్ లో తిట్టిపడేశాడు. ఆపై శాతకర్ణిని పొగుడుతూనే మెగాస్టార్ పై సెటైర్లు వేసినా, స్వయంగా చిరు వారించటంతో నాగబాబు మళ్లీ వర్మ జోలికి పోలేదు.

అయితే మెగాస్టార్‌ చిరంజీవి కుటుంబంపై తాను చేసిన వ్యాఖ్యల తరువాత ఏర్పడిన ప్రతికూలతను తగ్గించుకోవాలనుకున్నాడో ఏమో వర్మ క్షమాపణలు చెప్పాడు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ పెడుతూ, 'చిరంజీవి లాంటి అన్నయ్య నాకుంటే నేను మాట్లాడిన మాటలకి కొట్టేవాడిని. నాగబాబు మాటలతోనే వదిలేశారు. రియల్లీ సారీ టూ హిమ్ (ఆయనకు నిజంగా క్షమాపణలు)' అని అన్నాడు.

 

ఇక వరుణ్ తేజ్ కు ఉద్దేశిస్తూ మరో ట్వీట్ చేస్తూ నువ్వు, మీ నాన్న నా మీద చేసిన కామెంట్లు సరైనవే. నా తరపున జరిగిన తప్పులకు మీ ఇద్దరికీ క్షమాపణలు చెబుతున్నా అంటూ మరో ట్వీట్ వేశాడు. ఈ మధ్యే పీకే ఫ్యాన్స్ కి సారీ చెప్పిన వర్మ ఇంకా ఎవరినీ ఇబ్బందిపెట్టబోనని చెప్పి, రెండు రోజులకే మెగా ఫ్యామిలీకి కూడా క్షమాపణలు చెప్పటంతో ఇక ఈ వివాదంకు పుల్ స్టాప్ పడిందనే అనుకోవాలేమో! మొత్తానికి వర్మ వోడ్కో మానేయటం అంతా మంచికే అనిపిస్తుంది కదా.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Gopal Varma  Naga Babu  Apology Tweets  

Other Articles