ఫ్రెష్ బ్యూటీనే ఆల్ మోస్ట్ ఫిక్సయ్యిందా? | Raashmika look test for Naa Peru Surya.

Crazy beauty confirmed for allu arjun next

Raashmika Madanna, Raashmika Madanna Tollywood, Raashmika Madanna Allu Arjun, Raashmika Madanna New Movies, Raashmika Madanna, Sandalwood Actress Allu Arjun, Rashmika 2017 Movies, Rashmika Craze, Naa Peru Surya Rashmika

Raashmika Madanna confirmed for Allu Arjun-Vakkantham Vamshi's next movie. “Rashmika was in the city for a special photoshoot for her look in Naa Peru Surya. She along with Allu Arjun did a trail shoot at Hotel Trident in the last weekend. The team is impressed with her looks and also her performance in Kirik Party. They feel that she will make a fresh pairing with Bunny,” reveals a source close to the production.

బన్నీ పక్కన కూడా ఆ క్రేజీ బ్యూటీయేనా?

Posted: 04/04/2017 03:43 PM IST
Crazy beauty confirmed for allu arjun next

శాండల్ వుడ్ లో రష్మిక మందన్న పేరు ఇప్పుడు మారు మోగిపోతుంది. కిరాక్ పార్టీ లాంటి అవార్డు విన్నింగ్ మూవీలో ఫెర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకున్న రష్మికపై ఇప్పుడు అన్ని భాషల కళ్లు పడుతున్నాయి. ఇప్పటికే కోలీవుడ్ నుంచి జయం రవి, శివకార్తీకేయన్ లాంటి యంగస్టర్లు తెగ ట్రై చేస్తుండగా, టాలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు భారీగానే వెల్లువెత్తుతున్నాయి.

నాగశౌర్య మూవీతోపాటు ప్రభాస్-సుజిత్ మూవీలో కూడా రష్మికనే కన్ఫర్మ్ అయ్యిందనే టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే బన్నీ కూడా ఈ కన్నడ బ్యూటీకే ఓటు వేసినట్లు తెలుస్తోంది. వక్కంతం వంశీతో తీయబోయే సినిమా కోసం 20 ఏళ్ల రష్మికనే ఫైనలైజ్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. హైదరాబాద్ లోని ఓ హోటళ్లో గుట్టు చప్పుడు కాకుండా ఫోటో షూట్ కానిచ్చేసిన దర్శకుడు, ఆపై బన్నీ తో చిన్నపాటి ట్రయల్ షూట్ కూడా చేశాడంట.

ప్రెష్ ఫేస్ కావటం, పైగా కిరాక్ పార్టీలో ఆమె నటన నచ్చటం, అది గాక బన్నీ పక్కనే ఈ భామ సూట్ కావటంతో దాదాపు ఒకే అయ్యిందని ప్రోడక్షన్ వర్గాల నుంచి సమాచారం. దేశ భక్తి నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి నా పేరు సూర్య అనే టైటిల్ పరిశీలనలో ఉంది. నా ఇల్లు ఇండియా అన్నది ట్యాగ్ లైన్. మరోవైపు కన్నడలో రష్మిక హర్ష అనే హీరోతో అంజనిపుత్ర అనే సినిమాలో నటిస్తోంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rashmika Madanna  Allu Arjun  Tollywood Movies  

Other Articles