ఈ సినీయర్ నటుడు ఎక్కడ? ఇండస్ట్రీలో ఆర్థికంగా మోసం చేసిందెవరు? | Who cheated Costumes Krishna in Tollywood.

Costumes krishna cheated in tollywood

Costumes Krishna, Costumes Krishna Interview, Costumes Krishna Tollywood, Costumes Krishna Cheated, Costumes Krishna Pelli Pandiri, Costumes Krishna Movies, Costumes Krishna Producer, Costumes Krishna Financial Troubles

Costumes Krishna financial cheated by financiers with Pelli Pandiri movie business. Now he wants to re entry with good subject.

వాళ్ల చేతుల్లో దారుణంగా మోసపోయా: కాస్టూమ్స్ కృష్ణ

Posted: 04/01/2017 11:26 AM IST
Costumes krishna cheated in tollywood

వెటరన్ దర్శకుడు కోడి రామకృష్ణ సినిమాలతో ఎక్కువ పాపులర్ అయిన సీనియర్ నటుడు కాస్టూమ్స్ కృష్ణ గుర్తున్నాడా? భారత్ బంద్, పెళ్లాం చెబితే వినాలి లాంటి చిత్రాల్లో ఆయన విలనిజంతో కొత్త ఒరవడిని సృష్టించిన ఆయన తర్వాత చాన్నాళ్లుగా అజ్నాతంలో ఉండిపోయాడు. ఈ మధ్యే శతమానం భవతి సినిమా వేడుకలో ఆయనకు ఘన సన్మానం చేయటం చూశాం. నటుడిగానే కాదు, నిర్మాతగా కూడా ఆయన కెరీర్ లో సక్సెస్ అయ్యాడు. అయితే పెళ్లి పందిరి సినిమా సమయంలో ఆయనకు జరిగిన మోసం మాత్రం ఆయన్ని క్రమంగా సినిమాలకు దూరం చేసిందంట. అదేంటో తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయనే చెబుతున్నాడు.

జగపతి బాబు, రాశి జంటగా  కోడి రామకృష్ణ దర్శకత్వంలో  పెళ్లి పందిరి చిత్రాన్ని నిర్మించింది ఈయనే. అప్పటికే పరిచయం ఉన్న వ్యక్తి కావటంతో రెమ్యునరేషన్ తగ్గించుకుని మరీ జగ్గూ భాయ్ ఇందులో హీరోగా నటించాడు కూడా. కేవలం 45 రోజుల్లో నిర్మించిన ఈ చిత్రం రిలీజ్ కు ముందే పలువురు సెలబ్రిటీలకు ఆయన చూపించటం, వారు అది హిట్ అని చెప్పటంతో పబ్లిసిటీ కూడా అవసరం లేదని కృష్ణ డిసైడ్ అయ్యాడంట. అయితే ఈ విషయంలో జగపతి బాబు మాత్రం ఖచ్ఛితంగా పబ్లిసిటీ చేయాల్సిందేనని పట్టుబట్టడంతో కాస్త తగ్గాడంట.

ఆ సమయంలో ఫైనాన్షియర్లు తనకు రెండు లక్షలు ఇచ్చారని, ఖాళీ స్టాంపు పేపర్లపై సంతకాలు తీసుకున్నారని, అదే తనని పెద్ద దెబ్బతీసిందని ఆయన చెప్పాడు. సినిమా హిట్ అయ్యాక తమిళ్ రీమేక్ కోసం 7 లక్షలకు తాను బేరం కుదుర్చున్నానని, కానీ, ఫైనాన్సియర్లు మధ్యలో కల్పించుకుని 25 లక్షలు డిమాండ్ చేయగా తాను ఇదేంటని అడిగితే.. ఆ స్టాంపు పేపర్లు చూపించి నీకు సంబంధం లేదని చెప్పటంతో తాను మోసపోయినట్లు అర్థమైందని వివరించాడు.

తనకి చదువు రాకపోవటంతోనే ఇదంతా జరిగిందని, ఇక అప్పటి నుంచి సినిమాలు నిర్మించని ఆయన తర్వాత తర్వాత మెల్లిగా సినిమాల్లో నటించటం కూడా మానేశానని చెప్పాడు. మంచి క్యారెక్టర్లు దొరికితే చేయటానికి తాను ఇప్పటికీ సిద్ధమేనని ఆయన అంటున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Costumes Krishna  Tollywood Actor  Financial Troubles  

Other Articles