బాహుబలి-2... ఫస్ట్ డే కలెక్షన్ల కోసం ఏం చేస్తున్నారో తెలుసా? | Planning for Baahubali 2 First Day Collections.

Baahubali 2 first day target

Baahubali 2, Baahubali 2 First day Collections, Baahubali 2 Target, Baahubali 2 Collections Target, Baahubali 2 Overseas Business, Baahubali The Conclusion Business, Baahubali 2 Collections Target

Trade Analysts On Baahubali 2 First Day Collections. Expect to create waves in Tollywood.

బాహుబలి-2 వసూళ్ల సునామేనా?

Posted: 03/31/2017 04:34 PM IST
Baahubali 2 first day target

టాలీవుడ్ లో కలెక్షన్ల మాట ఇప్పటిదాకా ఒక ఎత్తు.. ఏప్రిల్ 28 తర్వాత ఇంకో ఎత్తు. బాహుబలి-2 వచ్చేస్తుంది కాబట్టి. అవును... దేశ ప్రజలంతా ఎంతో ఎగ్జయిటింగ్ గా ఎదురుచూస్తున్న రెండో పార్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు మొదలవ్వగా, కౌంట్ డౌన్ దగ్గర పడే కొద్దీ అది మరింత ఎక్కువైపోతుంది.

ముఖ్యంగా ఓవర్సీస్ లో బాహుబలి ది కంక్లూజన్ ఫస్ట్ డే ధర ఓ రేంజ్ లో పేలబోతుందని టాక్. ఇప్పటిదాకా అక్కడ హయ్యెస్ట్ ప్రీమియర్ షో రేటు ఇరవై ఐదు నుంచి ముప్పై డాలర్లుగానే ఉండేది. కానీ, బాహుబలి కోసం దానిని నలభై డాలర్లు చేయబోతున్నారని తెలుస్తోంది. అఫ్ కోర్స్ సినిమాపై ఉన్న క్రేజ్ కి ఈ ఫ్లాన్ వర్కవుట్ అయ్యేలా కనిపిస్తోంది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జిబిటర్లు.. థర్డ్ పార్టీల నుంటి డిస్ట్రిబ్యూటర్లకు పెద్ద మొత్తాలకు ఎంక్వైరీలు వస్తున్నాయి. ఫిక్సెడ్ హైర్స్ విషయంలో ముఖ్యంగా సీ డీ సెంటర్ల నుంచి అదిరిపోయే రేట్ తో ఆఫర్స్ వస్తున్నాయంట. ఇప్పటిదాకా తొలి రోజున ఉన్న రికార్డులను బాహుబలి 2 చెరిపేయటమే కాదు, సుమారు 40 కోట్లను కొల్లగొట్టడం ఖాయం అని అంచనా వేస్తున్నారు. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఇలా ఉంటే మిగతా భాషల్లో ఇంకెలా ఉంటాయోనని, ఆ లెక్కన కలెక్షన్ల సునామీకి కొత్త మీనింగ్ చెప్పటం ఖాయమనే చెప్పొచ్చు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali 2  First Day Collections  

Other Articles