రజనీకి సాలిడ్ వార్నింగ్ పడింది.. వెనక్కి తగ్గాడు | Political Dig Rajinikanth cancels Jaffna visit.

Rajinikanth cancels his proposed visit to sri lanka

Rajinikanth, Rajinikanth Sri Lanka Tour, Rajinikanth Jaffna, Superstar Jaffna Tour, Superstar Sri Lanka Tour, Viduthalai Chiruthaigal Katchi Rajinikanth, VCK Rajinikanth

Superstar Rajinikanth cancels his trip to Sri Lanka after protests from Tamil groups.

రజనీకాంత్ శ్రీలంక పర్యటన రద్దు

Posted: 03/25/2017 04:08 PM IST
Rajinikanth cancels his proposed visit to sri lanka

సూపర్ స్టార్ రజనీకాంత్ శ్రీలంక పర్యటన అనూహ్య మలుపు తిరిగింది. జాఫ్నా ప్రాంతంలో తమిళుల కోసం జ్నానం ఫౌండేషన్ నిర్మించిన గృహ సముదాయాన్ని ప్రారంభించేందుకు రజనీ అక్కడికి వెళ్లనున్నాడు. అయితే రజనీ పర్యటనకు హాజరైతే అడ్డుకుని తీరతామని అక్కడి తమిళ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

రజనీకాంత్ తో రోబో 2.0 తీస్తున్న నిర్మాణ సంస్థ లైకా అధినేత కరన్ అల్లిరాజాకు చెందిందే ఈ జ్నానం గ్రూప్. సుమారు 22 కోట్లతో 150 ఇళ్లు నిర్మించింది. దీనిని రజనీ చేతుల మీదుగా ప్రారంభించాలని ఆ సంస్థ నిర్ణయించింది. ఏప్రిల్ 9, 10 తేదీల్లో పర్యటన ఖరారైంది కూడా. అయితే రాజకీయ సంఘాలు మాత్రం దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఎల్టీటీఈ ను నాశనం చేసిన శ్రీలంక ప్రభుత్వంకు మద్ధతుగా రజనీ చేసే పని ఉందన్నది వారి ఆరోపణ.

విదుతలై చిరుతైగల్ కట్చి (వీసీకే) నేత తోల్ తిరుమవలవన్ దీనిపై స్పందిస్తూ రజనీకాంత్ ఓ నటుడు. ఆయన పని జనాలను ఎంటర్ టైన్ చేయటమే. మేము మంచి స్నేహితులం కూడా. అందుకే విజ్నప్తి చేస్తున్నా దయచేసి ఈ కార్యక్రమానికి రావొద్దని. అంతేకాదు ఈ విషయమై ఆయన్ని త్వరలో కలవబోతున్నా అని కూడా వివరించాడు. దీంతో రజనీ తన టూర్ ను రద్దు చేసుకున్నట్లు సమాచారం. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Super Star  Rajinikanth  Sri Lanka Tour Cancel  

Other Articles