రీఎంట్రీ కోసం స్నేహ పడే కష్టాలు అంతా ఇంతా కాదు... | Sneha weight loss for re entry.

Actress sneha slim avatar for re entry

Actress Sneha, Sneha Re entry, Sneha Sivakarthikeyan, Sivakarthikeyan New Movie, Sivakarthikeyan Velaikkaran, Sneha Weight Loss, Sneha Gym Video

Actress Sneha to shed 10 kg to act in Fahadh’s 'Velaikkaran'. This Family beauty play crucial role in re entry for Sivakarthikeyan's next.

రీఎంట్రీ కోసం స్లిమ్ అవతారంలో స్నేహ

Posted: 03/25/2017 01:51 PM IST
Actress sneha slim avatar for re entry

ఒకప్పుడు గ్లామర్ హీరోయిన్లుగా చెలామణి అయినవాళ్లు ఇప్పుడు కాస్త ఎక్స్ పెరిమెంటల్ చిత్రాలతోనే రీఎంట్రీ ఇస్తున్నారు. అయితే సినిమాలో ఎలాంటి రోల్ అయినా సరే అందుకోసం స్టైలిష్ మేకింగ్ అవసరం అవుతోంది. అందుకే స్లిమ్ అవతార్ లో ఉండేవాళ్లకే ఎక్కువ ఛాన్సులు దక్కుతున్నాయి. ఆ లిస్ట్ లో నటి స్నేహ కూడా ఇప్పుడు రెడీ అవుతోంది. నటుడు ప్రసన్నతో పెళ్లి తర్వాత అడపా దడపా చిత్రాల్లో నటించినప్పటికీ తళ్లయ్యాక సినిమాలు చేయటం మానేసింది. ఇక ఇప్పుడు మళ్లీ ముఖానికి మేకప్ వేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందు కోసం బరువు తగ్గే పనిలో ఉందంట.

చివరగా అల్లు అర్జున్ సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో కనిపించిన స్నేహ దాదాపు రెండేళ్ల తర్వాత ఓ కోలీవుడ్ సినిమాకు కమిట్ అయ్యింది. శివకార్తీకేయన్ పహద్ ఫాసిల్ కాంబోలో తెరకెక్కుతున్న ఓ చిత్రం కోసం ఈ ట్రెడిషినల్ హీరోయిన్ ను అప్రోచ్ కావటం, క్యారెక్టర్ నచ్చటంతో అందుకు ఓకే చెప్పటం జరిగిపోయాయంట.

అయితే అందుకోసం 10 కేజీల బరువు తగ్గాలన్న కండిషన్ పెట్టడంతో ప్రస్తుతం అదే పనిలో బిజీగా ఉంది. జిమ్ లో చేరి కొవ్వును కరిగించుకునే పనిలో పడ్డ ఆమె ఇప్పటికే 7 కేజీలు తగ్గినట్లు తెలుస్తోంది. మరో 3 కేజీలు తగ్గగానే చిత్ర షూటింగ్ లో పాల్గొంటుందంట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Velaikkaran  Actress Sneha  Re Entry  

Other Articles