వైరల్ వీడియో : రణ్ బీర్- పాక్ హీరోయిన్..ఎందుకు బతిమిలాడుతోంది? | Why is Mahira Khan folding hands before Ranbir Kapoor.

Why was mahira khan pleading with ranbir kapoor

Ranbir Kapoor, Mahira Khan, Ranbir Mahira Video, Mahira Khan Folding Hands, Ranbir Kapoor and Mahira Khan, Mahira Pleads Ranbir, Ranbir Kapoor Mahira Khan Dubai, Ranbir kapoor CC Camera Video, Pakistan Actress Plead Ranbir

Ranbir Kapoor, Mahira Khan Spotted Catching Up Backstage At An Awards Function. Video goes Viral.

రణ్ బీర్ ను బతిమాలుతున్న పాక్ నటి.. ఏం జరిగింది?

Posted: 03/20/2017 04:48 PM IST
Why was mahira khan pleading with ranbir kapoor

సీసీ కెమెరాల పుణ్యమాని నేరాలే కాదు కొన్ని కొన్ని వీడియోలు నెట్ లో వైరల్ గా మారిపోతున్న విషయం తెలిసిందే. రణ్ బీర్ కపూర్, పాక్ నటి మహీరా ఖాన్ ల ఓ వీడియో ఒకటి లీకైంది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఓ వీడియో మీడియాలో తెగ వైరల్ అవుతుండగా అసలు ఏం జరిగిందా? అని ఆరాలు తీస్తున్నారు కొందరు.

దుబాయ్ లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు రణ్ బీర్ వెళ్లగా, అదే కార్యక్రమానికి మహీరా కూడా హాజరైంది. ఇద్దరూ కలిసి ర్యాంప్ పై వాక్ చేయటమే కాదు, మీడియాకు తెగ ఫోజులు కూడా ఇచ్చారు. అనంతరం హోటల్ రూం కి వెళ్లిపోయారు. అయితే అక్కడే అసలు విషయం జరిగింది. ఆ వీడియోలో రణ్ బీర్ కపూర్ అసహనంతో ఉండగా మహీరా ఖాన్ అతనిని బతిమాలుతోంది. తప్పు జరిగిపోయింది. క్షమించమని వేడుకుంటోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

 

 

కాగా, రయిస్ లో షారూఖ్ పక్కన మెరిసిన పాక్ బ్యూటీ మెహీరా ఇకపై ముగ్గురు ఖాన్ నటించబోనని , ఇమ్రాన్ హష్మీతో లిప్ లాక్ చేస్తే కేన్సర్ వస్తుందన్న తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మెహీరా పవాద్ ఖాన్ సరసన ఓ పాక్ సినిమాలో నటిస్తుండగా, రణ్ బీర్ డ్రాగన్, జగ్గా జసూస్ తోపాటు రాజ్ కుమార్ హిరాణీ డైరక్షన్ లో సంజయ్ దత్ బయోపిక్ లో చేస్తున్న విషయం తెలిసిందే. బహుశా సంజయ్ దత్ పై తీస్తున్న సినిమా కోసమే ఈ సీన్ తీశారా? అన్న అనుమానాలు కూడా ఓవైపు కలుగుతున్నాయి. ఇద్దరిలో ఎవరో ఒకరు పెదవి విప్పితేనే అసలు విషయం బయటపడేది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ranbir Kapoor  Mahira Khan  Dubai Video  

Other Articles

Today on Telugu Wishesh