రజనీ సపోర్ట్ అక్కర్లేదు.. కాబోయే సీఎం నేనే - శరత్ కుమార్ | Sarathkumar Tamil Nadu future CM.

Senior actor sarathkumar comments on tn politics

Tamil Nadu Politics, Rajinikanth, Sharath Kumar, Tamil Nadu Future Chief Minister, Not Rajinikanth Its Sharath Kumar, Senior Actor Sharath Kumar, Sharath Kumar Interview, Rajinikanth Political Support

Senior actor Sarathkumar Again Comments on Tamil Nadu Politics says He will Become CM in Future.

తమిళ రాజకీయాల్లో రాణిస్తా.. సీఎం అవుతా-శరత్ కుమార్

Posted: 03/20/2017 03:26 PM IST
Senior actor sarathkumar comments on tn politics

తమిళనాట సినిమా టూ రాజకీయాలు కొత్తేం కాకపోయినా అమ్మ చనిపోయాక ఇప్పుడు ప్రతీ ఒక్కరి కన్ను వాటి మీదే ఉంది. జయలలిత బతికున్నంత కాలం ధైర్యం చేయలేకపోయిన వారంతా ఇప్పుడు ఒక్కోక్కరుగా బయటికి వచ్చేస్తున్నారు. విశాల్, లారెన్స్ లాంటి వాళ్ల దగ్గరి నుంచి రజనీ, కమల్, అజిత్ లాంటి వాళ్ల పేర్లు తెర మీదకు వచ్చేస్తున్నాయి. అయితే ఎంతో కాలంగా రాజకీయాల్లోనే యాక్టివ్ గా ఉన్న శరత్ కుమార్ మాత్రం తనకు మాత్రం మాంచి ఫ్యూచర్ ఉందని ధీమాగా చెబుతున్నాడు.

ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చి(ఏఐఎస్ఎంకే) పేరుతో ఓ పార్టీ పెట్టిన శరత్ కుమార్ భార్య రాధికతో కలిసి ప్రచారం చేసినా పెద్దగా కలిసి రాలేదు. దీంతో అన్నాడీఎంకే పంచన చేరిన అమ్మ ఆధ్వర్యంలోనే ముందుకు సాగాడు. అయితే ఆమె బతికున్నంత కాలం కేవలం నీడగానే ఉండిపోయిన ఆయన ఇప్పుడు హడావుడి చేయటం ప్రారంభిస్తున్నాడు. ఆ మధ్య తమిళేతరులు ఇక్కడి రాజకీయాలకు పనికి రారంటూ రజనీపై పరోక్ష వ్యాఖ్యలు చేసి అభిమానుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కున్న విషయం తెలిసిందే.

ఇక ఇప్పుడు పొలిటిక్స్ లో తన సత్తా ఏంటో చూపిస్తానంటూ చెబుతున్నాడు. అందుకోసం సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ చేసుకోబోతున్నాడంట. రాజకీయాలకే ఎక్కువ సమయం కేటాయిస్తానని చెప్పిన ఈ సీనియర్ హీరో భవిష్యత్తులో ముఖ్యమంత్రి పీఠంపై కూడా ఆశలు పెట్టుకున్నానని అంటున్నాడు. కాస్త అతిఅయినప్పటికీ ప్రజల దగ్గర తనకు మంచి పేరే ఉందని, వారిని తానేం చెడు చేయకపోవటమే తన ఫ్లస్ పాయింట్ అని చెబుతున్నాడు. మరి రాజకీయంగా రాణించేందుకు సూపర్ స్టార్ సపోర్ట్ తీసుకుంటారా? అంటే చచ్చినా ఆ పని చేయనని ఖరాఖండిగా చెప్పేశాడు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actor Sharath Kumar  Tamil Nadu Politics  Rajinikanth  

Other Articles

Today on Telugu Wishesh