నిజమేనా? ఆ దేవుళ్ల‌ను తీసేసి..ప‌వ‌న్ ను పూజించాలంటున్న వర్మ.. | Pawan greater than those gods varma says.

Varma compared pawan with god and satire

Ram Gopal Varma Pawan kalyan, RGV Satires PK, RGV PK, Pawan God Ram Gopal Varma, Ram Gopal Varma Satires, Varma Mega Family, Pawan Kalyan.God, RGV Pawan God, RGV Pawan God Tweet

Director Ram Gopal varma again comments on Actor Pawan Kalyan. Compared him with certain gods immediately satire on Him.

పవన్ ను దేవుడితో పోలుస్తూనే మళ్లీ ఏసిన వర్మ

Posted: 03/20/2017 12:34 PM IST
Varma compared pawan with god and satire

చెప్పాలనుకున్న ఏ అంశానైనా సరే నేరుగా, సెటైర్లతో సూటిగా చెప్పేస్తుంటాడు దర్శకుడు రాంగోపాల్ వర్మ. ముఖ్యంగా మెగా ఫ్యామిలీని గత కొంత కాలంగా టార్గెట్ చేస్తూ విరుచుకుపడుతుండటం చూస్తున్నాం. మెగా బ్రదర్స్ ముగ్గురిని అస్సలు విడిచిపెట్టకుండా ఎప్పటికప్పుడు కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటాడు. అయితే పవన్ పర్సనల్ లైఫ్ పైనే కాదు, పొలిటికల్ కెరీర్ పైన కూడా వేసే నెగటివ్ ట్వీట్లు అభిమానులకు ఎప్పటికప్పుడు చిరాకుతోపాటు ఆగ్రహం తెప్పిస్తుంటాయి.

అయితే బూతు సినిమాలు చూస్తానని చెప్పుకునే వర్మ లాంటి వాడి వ్యాఖ్యలను అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదని పవన్ డైరక్ట్ గానే మీడియా ముందు తేల్చేశాడు కూడా. అయినా వర్మ మాత్రం పవన్ ను వదలటం లేదు. గత రాత్రి మరో ట్వీట్ తో పవన్ మళ్లీ ఓ ట్వీటేశాడు. 'నాకు మొక్కలంటే ప్రేమ..' అంటూ పవన్ పేరిట వచ్చిన ఓ పోస్టుపై వర్మ స్పందించాడు.

 

పవన్ కళ్యాణ్ దేవుడని తాను ఎప్పటికీ నమ్ముతానని, దేవుళ్ల స్థానాన్ని అతడితో భర్తీ చేయాలని కామెంట్ పెట్టాడు. ‘బాలాజీ, యాదగిరిగుట్ట స్వామి, భద్రాచలం రాముడు తదితర దేవుళ్ల స్థానాలను 'పీకే'తో భర్తీ చేయాలని నిజంగా భావిస్తున్నా' అని రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు. ఇంతకు ముందు బాహుబలి ట్రైలర్ ప్రభంజంను చూపుతూ కొంతమంది పవర్ ఫుల్ మెగా సూపర్ స్టార్లు ప్రభాస్ గోటి కిందకు కూడా పనికి రాడంటూ ట్వీట్లు చేసిన విషయం తెలిసిందే.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Gopal Varma  Pawan Kalyan  Satires  

Other Articles